Hug : హగ్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

కౌగిలింత... ఈ పదం వింటే ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం వస్తుంటుంది. కానీ కౌగిలింత మంచిదే అంటున్నారు నిపుణులు. కౌగిలింత మనకు కావాల్సిన ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యాన్ని, పెంపొందిస్తుంది. అంతేకాదు మన కోసం ఒకరు ఉన్నారన్న భావనను అందిస్తుంది. ఇక చాలా మంది కొత్తగా కలిసిన, లేదంటే కొన్ని రోజుల తర్వాత కలిసిన ఎమోషనల్ పరిస్థితిలో అయినా సరే హగ్ చేసుకుంటారు. దీని వల్ల పాజిటివ్ ఎక్కువగానే ఉంటుందట. అయితే ఈ రోజు హగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా?

Written By: Swathi Chilukuri, Updated On : November 12, 2024 1:28 pm

Do you know how many benefits a hug has?

Follow us on

Hug : హగ్ ఇవ్వడం అంటే తప్పు చేసినట్టుగా భావించవద్దు. ఇదొక నార్మల్ ప్రక్రియ మాత్రమే. కానీ దీని వల్ల ప్రయోజనాలు ఎక్కువే ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది ప్రేమికులు తమ ప్రియమైన వారిని హగ్ చేసుకుని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఇక కౌగిలింతలలోనూ అనేక అర్ధాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం మాత్రం ఒకటి ఉంది. ఈ హగ్ తీరును బట్టి అర్ధాలు మారుతాయి అంటున్నారు నిపుణులు. హగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం. హగ్ శరీరంలోని అనేక భాగాలను ఉత్తేజపరుస్తుంది. శాంతిగా ఉంచుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది ఈ సింపుల్ హగ్.

ఎండోర్ఫిన్ విడుదల: హగ్ చేయడం ద్వారా శరీరంలో “సంతోష హార్మోన్” అయిన ఎండోర్ఫిన్లు విడుదల అవుతాయి. ఇది ఒత్తిడి, బాధను తగ్గించి, మానసిక శాంతిని పెంచుతుంది. ఎమోషనల్ గా ఫీల్ అయినప్పుడు ఎవరైనా వచ్చి హగ్ చేసుకుంటే మీ బాధ నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.

ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్మించడం: హగ్ చేసుకోవడం అనేది మానసిక సమ్మిళితం, ప్రేమ, మద్దతు భావాలను ప్రదర్శించే ఒక గొప్ప మార్గం అంటున్నారు నిపుణులు. ఇది కుటుంబం, స్నేహితులు లేదా జంటల మధ్య బంధాలను బలపరచడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది.

హార్మోన్ స్థిరత్వం: హగ్ చేయడం ద్వారా “ఆక్సిటోసిన్” అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఆందోళనను తగ్గించి, మనశ్శాంతిని పెంచుతడంలో సహాయపడుతుంది.

శరీరానికి శాంతి: శరీరంలోని టెన్షన్ ను విడుదల చేసే ప్రక్రియ, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

భావోద్వేగ అనుభూతి: కొన్నిసార్లు మనం నెగిటివ్ భావోద్వేగాలను ఎదుర్కొన్నప్పుడు, హగ్ చేసుకోవడం మనసుకు దయ, మద్దతు, ప్రేమను అందిస్తుంది.

సామాజిక సంబంధాల పునరుద్ధరణ: హగ్ చేయడం అనేది సామాజిక సంబంధాలను ప్రగాఢం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఇది ఇతరులతో అనుబంధాన్ని పెంచుతుంది.

కంట్రోలింగ్: హగ్ చేసే సమయం లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శరీరంలో అనుకూల మార్పులు జరుగుతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే మీ ప్రియమైన వారిని హగ్ చేసుకోండి. హగ్ వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.