Children Care: సాధారణంగా పిల్లలు ఒంటరిగా పడుకోవడానికి ఇష్టపడరు. అందుకే తల్లిదండ్రులతో కలిసి పడకుంటారు. పసి వారి కోసం ప్రత్యేక గది కేటాయించాలి. అందులోనే వారిని పడుకోబెట్టాలి. దీని వల్ల తల్లిదండ్రులకు సౌకర్యవంతంగా ఉంటుంది. చిన్నారులను ఏ వయసు నుంచి విడిగా పడుకోవడం అలవాటు చేయాలనేది తెలుసుకుంటే మంచిది. లేకపోతే వారు ఇక విడిగా పడుకోవడానికి మొగ్గు చూపకపోతే మనకు కష్టాలు తప్పవు. పిల్లలను విడిగా పడుకోబెట్టడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోవాలి.
పిల్లలకు ప్రత్యేక గది
ఇంట్లో పిల్లలకు ప్రత్యేక గది లేకపోవడం, ఉన్నా అందులో ఏసీ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు తల్లిదండ్రులతోనే పడుకుంటారు. పిల్లల్ని ఒంటరిగా పడుకోబెడితే టీవీ, మొబైల్ వంటి వాటికి అలవాటు పడతారని భయపడుతుంటారు. కొందరు ఒంటరిగా పడుకోవడానికి భయపడుతుంటారని సర్వేలు చెబుతున్నారు. చిన్నారికి మూడు నెలల వయసు వచ్చినప్పటి నుంచి దూరంగా పడుకోబెట్టాలి.
ఏడాది దాటిన..
ఏడాది దాటిన పిల్లల్ని ప్రత్యేక గదిలోనే పడుకోబెట్టాలి. రాత్రంతా వదిలేయకుండా అప్పుడప్పుడు వెళ్లి గమనించాలి. మధ్యమధ్యలో గమనించి వారి అవసరాల తీరుస్తూ ఉండాలి. మీ చిన్నారి పడుకున్న గదిలో ఓ కెమెరా అమర్చాలి. మొబైల్ ను కనెక్ట్ చేయడం ద్వారా గదిలో పడుకోవడానికి అలవాటు పడతారు. ఇక వారు ఎలా పడుకుంటున్నారోననే భయం ఉండదు.
ఇష్టమైన వస్తువులు
గదిలో వారికి ఇష్టమైన పెయింటింగ్స్, వాల్ హ్యాంగింగ్స్, థీమ్ బెడ్, బొమ్మలు ఇతర అలంకరణ వస్తువులు గదిలో ఉంచుకోవాలి. పిల్లల్ని భయపెట్టే సినిమాలు, హారర్ సినిమాలు చూపించకూడదు. పిల్లలు ఒంటరిగా పడుకోకపోతే కొన్ని రోజులు వారితో పడుకున్నట్లు అలవాటు చేయాలి. పిల్లలకు ప్రత్యేక గది ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇలా చిన్నపిల్లలను ప్రత్యేక గదిలోనే పడుకునేలా చూడాలి.