60 Lakhs Job: ఏడాదికి రూ.60 లక్షలు వచ్చే ఈ ఉద్యోగం గురించి తెలుసా?

చార్డెడ్ అకౌంట్.. ఒకప్పుడు చార్టడ్ అకౌంట్ (సీఏ) చేయాలంటే ఎంతో ప్రయాస ఉండేది. దీంతో చాలా మంది సీఏ చేయడానికి వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు చాలా మంది సీఏ చదవడానికి ముందుకు వస్తున్నారు.

Written By: Chai Muchhata, Updated On : September 14, 2023 6:21 pm

60 Lakhs Job

Follow us on

60 Lakhs Job: ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త జాబ్ రావాలంటే కష్టంగా మారుతోంది. ఉన్నత చదువులు చదివినా కొంతమంది విద్యావంతులు సరైన ఉద్యోగం దొరకక ఖాళీగానే ఉంటున్నారు. మరికొంత మంది మాత్రం తమ స్థాయికి తగ్గ జాబ్ దొరకకపోవడంతో చిన్న ఉద్యోగంతో నెట్టుకొస్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని రంగాల్లోని వారు లక్షల రూపాయల జీతం అందుకుంటున్నారు. రూ.4 లక్షల నుంచి రూ. 20 లక్షల ప్యాకేజీతో అలరిస్తున్నారు. ఇంతకీ ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం అందుకున్న ఆ రంగాలు ఏవో తెలుసుకుందాం..

చార్డెడ్ అకౌంట్.. ఒకప్పుడు చార్టడ్ అకౌంట్ (సీఏ) చేయాలంటే ఎంతో ప్రయాస ఉండేది. దీంతో చాలా మంది సీఏ చేయడానికి వెనుకడుగు వేశారు. కానీ ఇప్పుడు చాలా మంది సీఏ చదవడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా మెరిట్ తో ఈ కోర్సును పూర్తి చేస్తున్నారు. ఇలా పూర్తి చేసిన వారికి ఫుల్ డిమాండ్ ఉంది. కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా సీఏలను నియమించుకుంటుంది. ఈ తరుణంలో వీరికి రూ.6 నుంచి 7 లక్షల వరకు ప్యాకేజీ ఇస్తారు. సీఏ చదివిన వారు ఫైనాన్స్ కంట్రోలర్స్, చీఫ్ అకౌంట్ ఆఫీసర్స్, వాల్యూయర్లుగా కొనసాగుతారు.

నేటి కాలంలో టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే సమయంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నారు. అయితే సైబర్ నేరాల నుంచి తమ వ్యవస్థను కాపాడుకునేందుకు సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకర్లను నియమించుకుంటారు. వీరి జీతం రూ.10 నుంచి రూ.30 లక్షల ప్యాకేజీ ఉంటుంది. కంప్యూటర్ లో బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. భారత్ లో అత్యుత్తమ ఉద్యోగాలలో ఫైలట్ రంగం ఒకటి. ఇదుంలో పనిచేసేవారికి నెలకు రూ.1.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు జీతాలు ఉంటాయి.

మానవ శక్తికి ప్రత్యామ్నాయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలీజన్స్ (ఏఐ) అభివృద్ధి చెందుతోంది. దీంతో చాలా కంపెనీలు ఏఐ నిపుణుల వైపు చూస్తున్నాయి. ఏఐకి సంబంధించిన కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సంవత్సరానికి రూ.60 లక్షల ప్యాకేజీ ఉంది. ఐటీ కంపెనీల్లో డేటా సైంటిస్టుల పనితీరు కీలకంగా ఉంటుంది. పలు కంపెనీలు వీరి కోసం అన్వేషిస్తాయి. ఈ క్రమంలో వీరికి ఏడాదికి రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్యాకేజీ ఇస్తుంటాయి.