Highest Mileage Cars: భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ పీపుల్స్ కొత్తగా కారును కొనుగోలు చేస్తున్నారు. వీరు తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల కోసం చూస్తున్నారు. వీరి కోసం కంపెనీలు ప్రత్యేకంగా లో-బడ్జెట్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. వీటిలో Maruthi Suzuki కంపెనీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన Swift కారు ఇప్పటికే దశాబ్దాలుగా అత్యధిక Salesను నమోదు చేసుకుంది. దీంతో దీనిని గత ఏడాదిలో స్విప్ట్ జనరేషన్ పేరుతో కొత్తకారును మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కారు మైలేజ్ గురించి ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఈ కొత్త కారు మైలేజ్ గురించి తెలిస్తే షాక్ అవుతారని కొందరు అంటున్నారు. ఇంతకీ ఈ కారు మైలేజ్ ఎంత ఇస్తుందో తెలుసా..?
Maruthi Suzuki Swift కారు హ్యాచ్ బ్యాక్ వేరియంట్లో ఎవర్గ్రీన్ గా నిలుస్తుంది. ఈ కారులో 1.2 లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఇందులో పొందుపరిచారు. పెట్రోల్ ఇంజన్ కారు 81.58 bhp పవర్ ను, అలాగే 111.7 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్జీ వేరియంట్ లో bhp పవర్ 101.8 NMటార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్లు 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు 5 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ పై పని చేస్తాయి. పెట్రోల్ ఇంజన్ పై 25.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే CNG పై 32.8 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఈ కారుపై 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
Swift ను ఎక్కువగా కొనుగోలు చేయడానికి దీని ఫీచర్లే కారణమని కొందరు అంటున్నారు. ఇందులో 9 అంగుళాల ఇన్పోటైన్మెంట్ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటివి ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, 3.8 సీట్ బెల్ట్ ను అమర్చారు. అలాగే సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ వంటివి అమర్చారు.
ఈ కారు ప్రస్తుతం మార్కెట్లో రూ. 6.49 లక్షల ప్రారంభ ధర నుంచి విక్రయిస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ 9.59 లక్షలతో అమ్ముతున్నారు. CNG వేరియంట్ ప్రారంభ ధర 8.19 లక్షల గా ఉంది. ఈ మోడల్ LXL,VXI,VXI(0), ZXI, ZXI ప్లస్ వంటి వేరియంట్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా టియాగో తో ఈ కారు పోటీ పడుతుంది. టాటా టియాగో కారు ధర రూ. 4.99 లక్షల ప్రారంభ ధరతో ఉన్నా.. ఈ కారుకు బదులు మారుతి సుజుకి స్విఫ్ట్ కోసం ఎగబడుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అందుకు కారణం స్విప్ట్ ఇచ్చే మైలేజ్ మాత్రమేనని చెబుతున్నారు. కొత్తగా కారు కొనే వారితో పాటు మైలేజ్ అధికంగా ఉండాలని అనుకునే వారు స్విఫ్ట్ కారు బెస్ట్ ఆప్షన్ అని పేర్కొంటున్నారు.