Homeలైఫ్ స్టైల్Money Plant: ఇంట్లో పెట్టుకునే మట్టి అవసరం లేకుండా పెరిగే ఈ మొక్కల గురించి తెలుసా?

Money Plant: ఇంట్లో పెట్టుకునే మట్టి అవసరం లేకుండా పెరిగే ఈ మొక్కల గురించి తెలుసా?

Money Plant: మనుషులతో పాటు మొక్కలకు ప్రాణం ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అందువల్ల మానవ జీవితంతో సమానంగా చెట్లను పెంచాలని అంటారు. చెట్ల పెంపకంతో అవసరమైన ఆక్సిజన్ పొందినవారవుతారు. అంతేకాకుండా చెట్లు ఉండడం వల్ల ఆహ్లదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే పట్టణాల్లో చెట్లను పెంచుకునే అవకాశాలు తక్కువ. అందువల్ల ఇంట్లోనే చాలా మంది మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. కానీ మొక్కలు పెంచుకోవాలంటే మట్టి అవసరం ఉంటుంది. అయితే పట్టణాల్లో ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనుకునేవారు మట్టిని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ మట్టితో సంబంధం లేకుండా కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి ఇంటికి అందంగా కనిపించడంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తాయి. మరి మట్టితో పనిలేకుండా పెంచుకునే ఆ మొక్కలు ఏవో తెలుసుకుందాం..

కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి. అంతేకాకుండా అదృష్టాన్ని తెచ్చిపెడుతాయి. అలాంటి మొక్కల్లో ‘మనీ ప్లాంట్’ ఒకటి. మనీ ప్లాంట్ ను చాలా మంది ఇంటిముందు కుండీలో మట్టి పోసి పెంచుకుంటారు. కానీ ఈ దీని పెంపకానికి మట్టి అవసరం లేదు. ఒక గాజు గ్లాసులో కొన్ని వాటర్ పోసి, అందులో చెట్టుకు సంబంధించిన కొమ్మలు వేసినా అది పాడైపోకుండా ఉంటుంది. అయితే ఈ మొక్కకు పోసిన నీటిని రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. లేకుంటే దోమల బాధ తప్పదు.

వెదురు బొంగుల గురించి చాలా మందికి తెలుసు. ఇది ఎక్కువగా అడవిలోనే పెరుగుతుంది. కానీ ‘లక్కీ బ్యాంబూ ట్రీ’ అనేది అచ్చం వెదురు బొంగుల వలె ఉంటుంది. దీని పెంపకానికి మట్టి అవసరం ఉండదు. ఒక గాజు గ్లాసులో నీళ్లుపోసి అందులో పెంచుకోవచ్చు. అయితే ఈ గాజు గ్లాసు అందంగా కనిపించడానికి కొన్ని గులకరాళ్లు వేసుకోవచ్చు. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే ‘ఫిలోడెండ్రాన్’ అనే ప్లాంట్ పెంపకానికి కూడా మట్టి అవసరం ఉండదు. అంతేకాకుండా ఇది ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది.

ఇక ‘అగ్లోనెమా ’అనే ప్లాంట్ సైతం ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చు. దీని ఆకులు డబుల్ షేడ్ ను కలిగి ఉంటాయి. దీని పత్రాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ మొక్క పెంచుకునేందుకు నీటి అవసరం మాత్రమే ఉంటుంది. మట్టితో పనిలేకుండా ఇది పెరుగుతుంది. ఇలా మట్టితో ఇబ్బంది పడేవారు కేవలం నీటిలో మొక్కలు పెంచుకోవచ్చు. వీటి వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉండడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
ఇంట్లో పెట్టుకునే మట్టి అవసరం లేకుండా పెరిగే ఈ మొక్కల గురించి తెలుసా?

మనుషులతో పాటు మొక్కలకు ప్రాణం ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అందువల్ల మానవ జీవితంతో సమానంగా చెట్లను పెంచాలని అంటారు. చెట్ల పెంపకంతో అవసరమైన ఆక్సిజన్ పొందినవారవుతారు. అంతేకాకుండా చెట్లు ఉండడం వల్ల ఆహ్లదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే పట్టణాల్లో చెట్లను పెంచుకునే అవకాశాలు తక్కువ. అందువల్ల ఇంట్లోనే చాలా మంది మొక్కలను పెంచుకుంటూ ఉంటారు. కానీ మొక్కలు పెంచుకోవాలంటే మట్టి అవసరం ఉంటుంది. అయితే పట్టణాల్లో ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనుకునేవారు మట్టిని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ మట్టితో సంబంధం లేకుండా కొన్ని మొక్కలు పెంచుకోవచ్చు. ఇవి ఇంటికి అందంగా కనిపించడంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తాయి. మరి మట్టితో పనిలేకుండా పెంచుకునే ఆ మొక్కలు ఏవో తెలుసుకుందాం..

కొన్ని మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి నుంచి దూరం చేస్తాయి. అంతేకాకుండా అదృష్టాన్ని తెచ్చిపెడుతాయి. అలాంటి మొక్కల్లో ‘మనీ ప్లాంట్’ ఒకటి. మనీ ప్లాంట్ ను చాలా మంది ఇంటిముందు కుండీలో మట్టి పోసి పెంచుకుంటారు. కానీ ఈ దీని పెంపకానికి మట్టి అవసరం లేదు. ఒక గాజు గ్లాసులో కొన్ని వాటర్ పోసి, అందులో చెట్టుకు సంబంధించిన కొమ్మలు వేసినా అది పాడైపోకుండా ఉంటుంది. అయితే ఈ మొక్కకు పోసిన నీటిని రెండు లేదా మూడు రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. లేకుంటే దోమల బాధ తప్పదు.

వెదురు బొంగుల గురించి చాలా మందికి తెలుసు. ఇది ఎక్కువగా అడవిలోనే పెరుగుతుంది. కానీ ‘లక్కీ బ్యాంబూ ట్రీ’ అనేది అచ్చం వెదురు బొంగుల వలె ఉంటుంది. దీని పెంపకానికి మట్టి అవసరం ఉండదు. ఒక గాజు గ్లాసులో నీళ్లుపోసి అందులో పెంచుకోవచ్చు. అయితే ఈ గాజు గ్లాసు అందంగా కనిపించడానికి కొన్ని గులకరాళ్లు వేసుకోవచ్చు. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే ‘ఫిలోడెండ్రాన్’ అనే ప్లాంట్ పెంపకానికి కూడా మట్టి అవసరం ఉండదు. అంతేకాకుండా ఇది ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతుంది.

ఇక ‘అగ్లోనెమా ’అనే ప్లాంట్ సైతం ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చు. దీని ఆకులు డబుల్ షేడ్ ను కలిగి ఉంటాయి. దీని పత్రాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ మొక్క పెంచుకునేందుకు నీటి అవసరం మాత్రమే ఉంటుంది. మట్టితో పనిలేకుండా ఇది పెరుగుతుంది. ఇలా మట్టితో ఇబ్బంది పడేవారు కేవలం నీటిలో మొక్కలు పెంచుకోవచ్చు. వీటి వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉండడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Exit mobile version