https://oktelugu.com/

Best Mileage SUV Cars: అతి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ 6 ఎస్ యూవీల గురించి తెలుసా?

టాటా కంపెనీకి చెందిన ఈ కారు 1199 ఇంజిన్ కెపాసిటీతో కలిగి ఉంది. కేవలం పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే నడుస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మెషిన్ తో మూవ్ అయ్యే ఈ మోడల్ 20.09 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 1, 2023 / 11:02 AM IST

    Best Mileage SUV Cars

    Follow us on

    Best Mileage SUV Cars: కరోనా తరువాత ప్రతి ఒక్కరూ కారు కొనుగోలు చేస్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు తమ అవసరాల రీత్యా, ఫ్యామిలీ టూర్ కు 4 వెహికిల్ ను కలిగి ఉంటున్నారు. అయితే అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతో కొన్ని కార్ల ధరలు హైక్ ప్రైసెస్ లో ఉన్నాయి. కానీ మిడిల్ క్లాస్ పీపుల్స్ కు కూడా అందించేలా కొన్ని కంపెనీలు కార్లను తయారు చేశాయి. అప్డేట్ ఫీచర్స్ తో పాటు తక్కువ ధరలతో ఎస్ యూవీలను అందిస్తున్నాయి. ఆ కార్ల గురించి తెలుసుకుందామా?

    టాటా పంచ్:
    టాటా కంపెనీకి చెందిన ఈ కారు 1199 ఇంజిన్ కెపాసిటీతో కలిగి ఉంది. కేవలం పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే నడుస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్ మెషిన్ తో మూవ్ అయ్యే ఈ మోడల్ 20.09 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఐదుగురు ప్రయాణికులకు కన్వీనెంట్ గా ఉండే దీనిని రూ.5.59 లక్షలతో విక్రయిస్తున్నారు.

    టాటా నెక్సాన్:
    పెట్రోల్ తో పాటు డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ కారు 1199 సీసీ తో పనిచేస్తుంది. మాన్యువల్, ఆటో ట్రాన్స్ మిషన్ తో ఇంధన రకాన్ని భట్టి 24.07 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర రూ.7.9 లక్షలు.

    కియా సొనెట్:
    కియా కార్లు భారత్ లో బాగా అమ్ముడు పోతున్నాయి. వీటిలో సొనెట్ ఒకటి. 1 డీజిల్ ఇంజిన్, 2 పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో ఉన్న ఈ కారు డీజిల్ 1493, పెట్రోల్ 1197 సీసీ తో పనిచేస్తుంది. లీటర్ కు 18.4 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు 7.7 లక్షలతో విక్రయిస్తున్నారు.

    నిస్సాన్ మెగ్నైట్:
    999 సీసీ పెట్రోల్ ఇంజిన్ తో పాటు లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు మాన్యువల్ తో పాటు ఆటో ట్రాన్స్ మిషన్ గా పనిచేస్తుంది. దీని ధర రూ.5.59 లక్షలు.

    హ్యుండాయ్ వెన్యూ:
    వినియోగదారులను ఆకర్షించిన మోడల్ హ్యుండాయ్ వెన్యూ. 2 డీజిల్ ఇంజిన్, 2 పెట్రోల్ ఇంజిన్ తో నడిచే ఈ కారు 1493 సీసీ ఇంజిన్ తో పనిచేస్తుంది. 1197 సీసీ, 998 సీసీ వేరియంట్లలో లభిస్తుంది. లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే ఈ కారు 7.7 లక్షలతో అమ్ముతున్నారు.

    హ్యుందాయ్ ఎక్సర్ట్:
    ఇటీవల రిలీజ్ ఆకట్టుకుంటున్న మోడల్ ఇది. 1197 సీసీ తో పనిచేసే ఈ కారు 19.2 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. దీనిని 5.9 లక్షలతో విక్రయిస్తున్నారు.