sexual thoughts: ఎక్కువగా లైంగిక ఆలోచనలు వస్తున్నాయా.. ఇలా కంట్రోల్ చేసుకోండిలా!

కొందరికి హార్మోన్ల అసమతుల్యత కారణంగా లైంగిక కోరికలు అధికంగా ఉంటాయి. దీంతో అసలు కంట్రోల్ చేసుకోరు. దీనివల్ల లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు కూడా ఇలానే లైంగిక కోరికలు అధికమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించి కంట్రోల్ చేసుకోండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 21, 2024 8:38 pm

couple

Follow us on

sexual thoughts: ప్రతి ఒక్కరికి లైంగిక కోరికలు అనేవి సహజం. అయితే కొందరికి తక్కువగా లైంగిక కోరికలు ఉంటే మరికొందరికి ఎక్కువగా ఉంటాయి. అధికంగా వీటి గురించి ఆలోచిస్తుంటారు. అయితే కొందరు ఈ లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకుంటే మరికొందరు పూర్తిగా కంట్రోల్ చేసుకోలేరు. దీనివల్ల చాలా విషయాల్లో ఇబ్బందులు పడుతుంటారు. కొందరు అయితే సిగ్గు పడి అసలు ఈ విషయాల గురించి బయట మాట్లాడరు. కనీసం భాగస్వామితో కూడా మాట్లాడటానికి సంకోచిస్తారు. మరికొందరు అయితే మొహమాటం లేకుండా బోల్డ్‌గా ఉంటారు. కుటుంబ సభ్యులు, ఆఫీస్, స్నేహితులు ఇలా ఎవరితో అయిన ఈ విషయాలు షేర్ చేస్తారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే అసలు షేర్ చేసుకోరు. అబ్బాయిలు కనీసం తోటి స్నేహితులతో అయిన పంచుకుంటారు. ఇదిలా ఉంటే కొందరికి హార్మోన్ల అసమతుల్యత కారణంగా లైంగిక కోరికలు అధికంగా ఉంటాయి. దీంతో అసలు కంట్రోల్ చేసుకోరు. దీనివల్ల లేనిపోని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు కూడా ఇలానే లైంగిక కోరికలు అధికమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించి కంట్రోల్ చేసుకోండి.

 

లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకోవాలంటే మొదటిగా చేయాల్సిన పని ప్లేస్ మారాలి. పాత ప్లేస్‌లో ఉంటే మీకు అవే గుర్తు రావడం వల్ల మీరు మారాలనుకున్న మారలేరు. అదే మీకు తెలియని మనుషుల మధ్య కొత్త ప్లేస్‌లో ఉంటే ఆ కోరికలను కంట్రోల్ చేసుకుంటారు. అలాగే అసలు ఖాళీగా ఉండవద్దు. ఎంత ఎక్కువగా మీరు బిజీ ఉంటే అంత తక్కువగా ఆలోచనలు వస్తాయి. వర్క్ లేదా ఇంటి పనుల్లో బిజీగా ఉండటం, ఏదో బుక్ చదవడం వంటివి చేస్తే కాస్త వరకు లైంగిక కోరికలను కంట్రోల్ చేసుకోవచ్చు. లైంగిక కోరికలను పెంచే వాటికి కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొబైల్‌లో చూడటం, సినిమాల్లో రొమాన్స్ సీన్స్ చూడటం వంటివన్నీ ఆపేయాలి. మీ కళ్లకు ఎక్కడ కూడా రొమాన్స్‌కి సంబంధించినవి అసలు చూడకూడదు. ఇలా కొన్ని రోజులు పాటించడం వల్ల మీరు ఆ కోరికలను కంట్రోల్ చేస్తారు.

 

సాధారణంగా అబ్బాయిల కంటే అమ్మాయిలకే ఎక్కువగా లైంగిక కోరికలు ఉంటాయట. కానీ అమ్మాయిలు బయట పడరని చాలా అధ్యయనాల్లో తేలింది. అయితే లైంగిక కోరికలు ఎక్కువగా వస్తే హస్త ప్రయోగం చేయకూడదు. దీనివల్ల కూడా లైంగిక కోరికలు పెరుగుతాయట. దీనికి దూరంగా ఉంటే ఆటోమెటిక్‌గా లైంగిక కోరికలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువగా ఒంటరిగా కూర్చోని వాటి కోసం ఆలోచించకుండా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి మెలసి ఉండటం వల్ల కంట్రోల్ అవుతాయి. మీకు తెలియకుండానే మీరు కొన్ని రోజుల తర్వాత వాటికి దూరం అయిపోతారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. కేవలం గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.