Holi special: రంగుల పండుగగా పేరు ఉన్న హోలీని ప్రతి ఏడాది భారతీయ ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు స్నేహితులు అంతా కలిసి రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. హోలీ పండుగ రోజు ఎంత సంతోషంగా ఉంటామో.. రంగుల విషయంలో అంతే జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సాంప్రదాయ రంగులు వాడుతూ ఈ వేడుకను ఆనందంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. అయితే హోలీ పండుగ సమయంలో మనుషులు మాత్రమే కాకుండా మనకు ఇష్టమైన వాహనాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఆటోమొబైల్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ వేడుక రోజున కార్లు ఉన్నవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. లేకుంటే భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. అయితే హోలీ రోజు కార్లు ఉన్నవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
హోలీ పండుగ సమయంలో కార్లకు బదులు టూవీలర్ ను ఎక్కువగా వాడాలి. ఎందుకంటే హోలీ పండుగ రోజు కారు లోపల రంగులు పడే అవకాశం ఉంటుంది. వీటివల్ల సీటింగ్ పాడైపోయే అవకాశం ఉంది. కొన్ని రంగులు ఎంత వాష్ చేసిన చెరిగిపోవు. అందువల్ల ఈరోజు సాధ్యమైనంతవరకు టూ వీలర్ పైనే ప్రయాణించాలి. అయితే ఇంట్లో హోలీ ఆడే సమయంలో కార్లపై ప్రత్యేకంగా కవర్లను వేసుకోవాలి. లేకుంటే కార్లపై పడే రంగు పోయే అవకాశం తక్కువగా ఉంటుంది.
హోలీ ఆడే సమయంలో కార్లకు సంబంధించిన విండోలను పూర్తిగా మూసి చేయాలి. ఈ ఆట ఆడే సమయంలో కొందరు రంగులు చల్లుకోగా ఆ రంగులు కారు లోపల పడే అవకాశం ఉంటుంది. కారు లోపల పడిన రంగులను ఎక్కువ రోజులు చూడకపోతే అవి అలాగే ఉండిపోతాయి. మళ్లీ వీటిని తొలగించుకోవడానికి ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
హోలీ ఆడే సమయంలో డాష్ బోర్డులు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటిపై రంగులు పడితే తీసివేయడం కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ రంగు పడిన తీసేసే క్రమంలో డాష్ బోర్డు నాణ్యత దెబ్బతింటుంది. అందువల్ల డాష్ బోర్డును ప్రత్యేకంగా కవర్తో లేదా నాణ్యమైన వ్యాక్సులు పూయాలి.
హోలీ పండుగ పూర్తయిన తర్వాత కార్ వాషింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఒక్కోసారి కారు లోపల పడినా రంగులను మనం గమనించం. ఇవి రోజుల తరబడి అలాగే ఉంటే కారు నాచురల్ కలలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అందువల్ల హోలీ పండుగ మరుసటి రోజే కారు వాషింగ్ ఇవ్వడం మంచిది.
హోలీ పండుగ రోజు ఇతరులు అడిగితే కారు అస్సలు ఇవ్వకపోవడం మంచిది. ఎందుకంటే ఈ సంబరాల్లో మునిగి కారును ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో వారు కారును డామేజ్ చేసే అవకాశం ఉంది. అయితే తప్పనిసరిగా ప్రయాణించాల్సి వస్తే కారుతో సొంత యజమాని వెళ్లడం మంచిది. అంతేగాని ఇతరులకు కారు ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే కొందరు కారుకు డ్యామేజ్ చేసే అవకాశం ఉందని తెలిస్తే అక్కడికి కారును తీసుకుపోకపోవడమే మంచిది.