Hair : పొడి, నిర్జీవమైన, దెబ్బతిన్న జుట్టును నివారించడానికి, జుట్టుకు నూనె రాయడం చాలా మంచిది. నూనె జుట్టుకు తేమను అందిస్తుంది. లోపలి నుంచి తేమను అందిస్తుంది. అంతేకాదు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అయితే ఎక్కువ ప్రయోజనాలను పొందేందుకు కొందరు రాత్రి పూట నూనె రాస్తారు. రాత్రి సమయంలో నూనె రాసుకొని ఉదయం తలస్నానం చేసే వారు కూడా ఉంటారు. అయితే రాత్రి నూనె రాసుకొని పడుకోవడం మంచిదా? కాదా? దీని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తలకు
రాత్రంతా నూనె రాసుకోవడం వల్ల చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలు పెరుగుతాయి. నూనె అతుక్కొని ఉంటుంది . రాత్రిపూట జుట్టుకు నూనె పెడితే చుట్టుపక్కల ఉన్న దుమ్ము, ధూళి దానికి అంటుకుని మీ జుట్టును దెబ్బతీస్తుంది.
తడి లేదా నూనె రాసుకున్న వెంట్రుకలు బలహీనంగా ఉంటాయి. అందుకే నిద్రపోతున్నప్పుడు రుద్దినట్టు అవుతుంది కాబట్టి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది. అంతే కాదు, జుట్టుకు నూనె రాయడం వల్ల దిండు, బెడ్‌షీట్ కూడా మురికిగా మారుతాయి. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది.
మొటిమల సమస్య
నూనెను తలపై అప్లై చేయడం వల్ల ముఖ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. నుదిటి, ముఖంపై మొటిమలు ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు రాత్రిపూట నూనె రాసుకుని నిద్రపోకూడదు. రాత్రిపూట నూనెను పెట్టుకోవడం వల్ల చర్మం సహజ నూనె సమతుల్యత దెబ్బతింటుంది. దీని వలన చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. జిడ్డు చర్మం కారణంగా చర్మ సమస్యలు పెరుగుతాయి.
ప్రతి ఒక్కరి చర్మ నాణ్యత భిన్నంగా ఉంటుంది. వారి చర్మానికి అనుగుణంగా నూనెను ఎంచుకోవాలి. మీరు మీ చర్మానికి అనుగుణంగా నూనెను ఎంచుకోకపోతే, కొన్ని నూనెలు చర్మంపై చికాకు, దురద లేదా అలెర్జీని కూడా కలిగిస్తాయి. కొందరికి నూనె వాసనకు అలెర్జీ ఉంటుంది. ముఖ్యంగా కొబ్బరి లేదా ఆవనూనె ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఇది తలపై రాసుకుంటే తలనొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది.
జుట్టుకు నూనె ఎప్పుడు రాయాలి?
మీరు మీ జుట్టుకు పోషణ, నూనెను అందించాలనుకుంటే, మీ జుట్టును శుభ్రం చేసుకోవడానికి 30 నిమిషాలు లేదా 1 గంట ముందు మీ జుట్టుకు నూనె రాయండి. మీ చర్మానికి అనుగుణంగా నూనెను ఎంచుకోండి. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆముదం పొడి జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, జిడ్డు, చుండ్రు జుట్టు కోసం వేప నూనె, టీ ట్రీ ఆయిల్ ఉపయోగించండి. జుట్టు రాలే సమస్య ఉంటే మాత్రం ఉసిరి నూనె ప్రయోజనకరంగా ఉంటుంది.
జుట్టుకు నూనెను పూసే విధానం
నూనెను కొద్దిగా గోరువెచ్చగా చేయండి. తద్వారా అది జుట్టులో సరిగ్గా చొచ్చుకొని పోతుంది. గోరువెచ్చని నూనె జుట్టుకు మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. మీ వేళ్లతో జుట్టు మూలాలకు నూనెను నెమ్మదిగా అప్లై చేసి, 5-10 నిమిషాల పాటు తేలికపాటి మసాజ్ చేయండి. తద్వారా రక్త ప్రవాహం పెరుగుతుంది. పోషణ జుట్టు మూలాలకు చేరుకుంటుంది. మూలాలు కాకుండా, జుట్టు పొడవు మీద కూడా నూనెను పూయండి. 1 గంట పాటు వదిలి, సాధారణ షాంపూతో జుట్టును కడగాలి.