https://oktelugu.com/

Angry: కోపం, చిరాకు వస్తుందా.. అయితే ఈ సమస్యలు మీలో ఉన్నట్టే..

విటమిన్ బీ6 లోపం ఉంటే ఎక్కువగా కోపం వస్తుందంటున్నారు నిపుణులు. ఇది మెదడుపై ప్రభావం ఎక్కువగా చూపుతుందట. మెదడు పనితీరు సరిగ్గా పనిచేయాలంటే ఆహారంలో విటమిన్ బీ6 ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 23, 2023 / 04:32 PM IST

    Angry

    Follow us on

    Angry: తనకోపమే తనకు శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ మధ్య ఎవరిని చూసినా కోపంతో ఊగిపోతుంటారు. మరి ఈ కోపం రావడానికి చాలా కారణాలు ఉంటాయట. కానీ విటమిన్ లోపం కూడా ఓ కారణం అని మీకు తెలుసా? కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల ఊరికే కోపం వస్తుందట. మరీ ఆ విటమిన్స్ ఏంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

    *విటమిన్ బీ6 లోపం ఉంటే ఎక్కువగా కోపం వస్తుందంటున్నారు నిపుణులు. ఇది మెదడుపై ప్రభావం ఎక్కువగా చూపుతుందట. మెదడు పనితీరు సరిగ్గా పనిచేయాలంటే ఆహారంలో విటమిన్ బీ6 ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. శరీరానికి సరిపడ బీ6 విటమిన్ అందకపోతే ఎప్పుడు కోపం వస్తుంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

    *విటమిన్ బీ12 కూడా మరో కారణం అని తెలుస్తోంది. ఈ విటమిన్ లోపం వల్ల నిత్యం అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. అవసరం లేని విషయాలకు కూడా చాలా కోపం వస్తుంటుందట ఈ విటమిన్ లోపం వల్ల. అంతేకాదు డిప్రెషన్ లోకి వెళుతుంటారట.

    * శరీరానికి సరిపడా జింక్ లేకపోయినా కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. అంతేకాదు జింక్ లోపం వల్ల ఆందోళన, చిరాకు, డిప్రెషన్ వంటివి వేధిస్తాయని తెలుస్తోంది.

    * మెగ్నిషియం సరిపడా లేకపోయినా కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందట.ఈ మెగ్నీషియం లోపం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుందట. దీంతో నిత్యం చికాకు కోపం వస్తుంటుంది.

    *ఇలా నిత్యం కోపం వస్తుంటే.. చిరాకు వస్తుంటే కచ్చితంగా ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే అని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో విటమిన్ బీ6, విటమిన్ బీ12, ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పచ్చి ఆకు కూరలు, అవకాడతో వంటి వాటితో పాటు మాంసం కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాల్సిందే. అంతేకాదు జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే.. చేపలు, బ్రోకలీ, మొలకలు వంటి వాటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. అప్పుడే కోపం, చిరాకు తగ్గుతుందని నిపుణులు సూచన.