Angry : మనసులో ఏదైనా సంఘర్షణ జరిగినప్పుడు ఒక ఉద్వేగం బయటకు వస్తుంది. దానినే కోపం అంటారు. ఈ కోపం వల్ల మనిషిలోని అవయవాలన్నీ స్పందిస్తాయి. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మనసులో ఆందోళన ఎక్కువవుతుంది. కోపం వల్ల ఒక్కోసారి మంచి జరగొచ్చు. లేదా చెడు జరగచ్చు. కానీ దాదాపు ఎక్కువ సార్లు చెడు ప్రభావాలే ఉంటాయి. అందువల్ల కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని చాలా మంది చెబుతూ ఉంటారు. కోపంలో కొన్ని చేయరాని పనులు కూడా చేయాల్సి వస్తుంది. మనిషికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కోపం అనంత స్థాయికి వెళ్లి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. అయితే ఎంత కోపం వచ్చినా.. దానిని తొలగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఆ తరువాత శాంతించడం వల్ల అనేక పనులు చక్కబెట్టుకోవచ్చు. మరి కోపం వచ్చినప్పుడు శాంతంగా మారడానికి ఏం చేయాలి?
కోపం వస్తుందని ముందే తెలిసినప్పుడు దృష్టిని మరల్చాలి. అంటే ఒక విషయంపై మాట్లాడుతున్నప్పుడు కోపం వస్తే ఆ విషయాన్ని మర్చిపోయి వేరే టాపిక్ లోకి వెళ్లే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల కోపం వచ్చే విషయం డైవర్ట్ అయి శాంతంగా మారే అవకాశం ఉంటుంది.
ఎక్కువగా కోపం వచ్చినప్పుడు శ్వాసపై దృష్టి పెట్టాలి. కోపంలో ఏం చేస్తామో ఒక్కోసారి అర్థం కాదు. ఈ క్రమంలో వేరే దృష్టి ఉండదు. కానీ ఈ సమయంలో శ్వాస పై దృష్టి పెట్టి.. శాంతంగా మారే ప్రయత్నం చేయాలి. అలా చేయడం వల్ల కోపం తగ్గే అవకాశం ఉంటుంది.
Also Read : కోపం, చిరాకు వస్తుందా.. అయితే ఈ సమస్యలు మీలో ఉన్నట్టే..
కోపం వచ్చినప్పుడు దాన్ని ఎదుటివారి పై ప్రదర్శించకుండా అసలు కోపం ఎందుకు వస్తుందో ప్రశ్నించుకోవాలి. ఆ కోపం తగ్గడానికి ఏం చేస్తే బెటరు ఆలోచించాలి. ఆ అవకాశం ఉంటే వెంటనే ప్రయత్నం ప్రారంభించాలి. సాధ్యమైనంతవరకు కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నమే చేయాలి.
కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని నిందించకుండా ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి.ఎందుకంటే ఒకరి కోపం వల్ల ఎదుటివారు నష్టపడకుండా ఉండాలి. ఎందుకంటే ఒకరి కోపం వల్ల ఎదుటివారి నష్టపడితే బంధాలు తెగిపోతాయి. భవిష్యత్తులో ఎవరితో కలిసి ఉండే అవకాశం ఉండదు. ఇలా ఎప్పటికీ ఎవరితో కలిసి లేకపోవడం వల్ల మనసు ఆందోళనగా ఉంటుంది. అందువల్ల కోపం వచ్చినప్పుడు ఎదుటివారిపై ప్రదర్శించకుండా ఆపుకునే ప్రయత్నం చేయాలి.
కోపం బాగా వచ్చినప్పుడు ఎదుటివారి విషయంలో కూడా ఆలోచించాలి. వారిపై కోపాన్ని ప్రదర్శిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలను గుర్తించుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికి కోపం లో ఏదైనా చేయొచ్చు. కానీ ఆ తర్వాత బాధపడితే ఏం లాభం లేదు. అందువల్ల భవిష్యత్తులో ఈ కోపం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఆలోచిస్తే ప్రస్తుత కోపాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
కుటుంబ సభ్యులపై పదేపదే కోపాన్ని తెచ్చుకోవడం వల్ల ఎప్పటికైనా నష్టమే. ఎందుకంటే వారిలో ఒక వ్యతిరేక భావన ఏర్పడి దూరం పెడుతూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలపై ఊరికే కోపం తెచ్చుకోవడం వల్ల వారిలో చెడ్డవారిగా ముద్ర పడిపోతారు. అందువల్ల ఒక్కోసారి కోపం వచ్చినా మరికొన్నిసార్లు వారితో శాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అయితే కోపం ఎందుకు వస్తుందో వారికి వివరించాలి.