Morning Walk: మన జీవనశైలి ప్రకృతి విరుద్ధంగా మారుతోంది. పూర్వ కాలంలో రాత్రుళ్లు త్వరగా పడుకుని ఉదయాన్నే నిద్ర లేచేవారు. ప్రస్తుతం ఆ పద్ధతి పూర్తిగా మారిపోయింది. రాత్రుళ్లు మేల్కొని ఇష్టారాజ్యంగా తింటూ ఉదయం పూట నిద్ర పోతున్నారు. దీంతో బద్ధకంతోనే బతుకుతున్నారు. ఏ సమయంలో చేయాల్సిన పనులు ఆ సమయంలో చేస్తేనే బాగుంటుంది. దీంతో మనిషి రోగాల బారిన పడుతున్నాడు. ముప్పై ఏళ్లకే మధుమేహం నలభై దాటకుండానే రక్తపోటు, గుండెపోటు వంటి రోగాలతో సతమతమవుతున్నాడు.

అయినా మన ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
ఎంత త్వరగా నిద్ర లేస్తే ఆరోగ్యం అంత బాగుంటుంది. తొందరగా పడుకుని త్వరగా మేల్కొంటే ఆరోగ్యం కలుగుతుంది. మనిషికి సరైన తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. రోజుకు కనీసం ఎనిమిది గంటలైనా నిద్ర పోతేనే ప్రయోజనం ఉంటుంది. దీనికి ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఫలితంగా జబ్బులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. దీనికి గాను మనం నిత్యం మంచి నిద్ర పోయేందుకు ప్రయత్నించాలి.
ఉదయాన్నే నిద్ర లేచే అలవాటును కూడా చేసుకోవాలి.
పూర్వం రోజుల్లో త్వరగా నిద్ర లేచేందుకు అలారం పెట్టుకునే వారు. దీంతో సమయానికి నిద్ర లేచి వాకింగ్ చేస్తే మంచిదే. అంతకంటే ముందు గోరు వెచ్చటి నీరు తాగడం మంచి అలవాటు. ఇందులో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే ఇంకా ప్రయోజనమే. ప్రతి రోజు కనీసం 45-60 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే షుగర్, బీపీ అదుపులో ఉంటాయి. దీంతో ఆరోగ్యం కుదుటపడుతుంది. శరీరం చరుకుగా మారుతుంది. మనకు కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.
మన జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే. సమతుల్య ఆహారం తీసుకోవాల్సిందే. గుండెజబ్బులు పెరిగిపోయేలా నూనె, కొవ్వులు కలిగిన ఆహారాలు తీసుకుంటే అనర్థాలే. అందుకే మన ఆహారపు అలవాట్లతో పాటు జీవనశైలిని మార్చుకుంటే మనకు ఎంతో లాభం కలుగుతుంది. మనిషి తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకపోతే మనుగడ సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు తన దైనందిన జీవితంలో జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఉదయం లేవగానే బద్ధకం వదలాలి. దైనందిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలి. మన శరీరం బద్ధకంగా ఉండకుండా చేసుకోవాలంటే మనం త్వరగా నిద్రపోతే ఫలితం ఉంటుంది. ఇక నిద్ర లేవగానే నీళ్లు తాగితే శరీరం అలసట నుంచి దూరం అవుతుంది. చురుకుగా కదిలేందుకు దోహదపడుతుంది. ఉదయాన్నే నిద్ర లేస్తేనే ప్రయోజనాలు ఉంటాయని తెలుసుకుని ఆ దిశగా కదలాలి.