Evil Spirits : దేవుడిని నమ్మేవారు దెయ్యాన్ని కూడా నమ్మాలంటారు. అందుకే కొందరు ఎన్ని పూజలు చేస్తారో.. రాత్రి దెయ్యాలు తిరుగుతాయని భయపడుతారు. ఈ తరుణంలో దుష్ట శక్తులు తమ దగ్గరికి రాకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి ఇంట్లో అనుకోని సంఘటనలు ఎదురైనా.. నిత్యం గొడవలు జరుగుతున్నా.. జ్యోతిష్యులకు సంప్రదిస్తారు. మరికొందరు మాత్రం తాంత్రిక పూజలు నిర్వహించేవారిని కలుస్తారు. ఈ తరుణంలో వారు చెప్పిన విధంగా పాటిస్తారు. తాయత్తలు కట్టుకోవడం లేదా ఇంటికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఇంట్లో అశుభాలు జరుగుతున్నాయని, ఏదైనా కీడు జరుగుతుందని అనిపిస్తే.. తాంత్రిక పూజారుల వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇవి చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వెళ్లి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంతకీ ఏం చేయాలి? ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి?
ఎలాంటి ఖర్చు లేకుండా దుష్ట శక్తులను వెళ్లగొట్టడానికి సింపుల్ గా ఇలా చేయొచ్చు. ఇంట్లోని తులసి ఆకులను కొన్నింటిని తీసుకోవాలి. వీటి రసాన్ని తీయాలి. ఈ రసంలో కొన్ని శుభ్రమైన నీటిని కలపాలి. ఇలా కలిపిన నీటిని ఇల్లంతా చల్లాలి. ఇలా చల్లిన తరువాత ఎలాంటి దుష్టశక్తి ఉన్నా బయటకు వెళ్తుందని అంటున్నారు.
సంవత్సరానికి ఒకసారి అయినా ఇంట్లో యజ్ఞం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా యజ్ఞం నుంచి వచ్చే పొగ ద్వారా ఇంట్లో ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా వెళ్లిపోతుంది. ఆ తరువాత కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. వద్దన్నా ధనం వచ్చి చేరుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. పెండింగ్ సమస్యలు తొలగిపోతాయి.
వారానికి ఒకసారి అయినా నిప్పులపై ధూపం వేయాలి. ఆ తరువాత వచ్చే పొగ ద్వారా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఈ పొగ ద్వారా దుష్ట శక్తులు పారిపోతాయని అంటారు. అలాగే ధూపం వేయడం వల్ల మంచి సువాజన వెదజల్లి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో ఉండే కాలిలో ఏవైనా క్రిములు ఉన్నా మటుమాయం అవుతాయి. అందువల్ల పూజ సమయాల్లో లేదా ప్రత్యేక సందర్భాల్లో కచ్చితంగా ధూపం వేసేందుకు ప్రయత్నించాలి.
అయితే దుష్ట శక్తులు రాకుండా ఇలాంటి పనులు చేస్తున్నా.. మరోవైపు దైవానుగ్రహం కోసం కొన్ని పనులు చేస్తుండాలి. నిత్యం పూజలు, వ్రతాలతో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటే ఇంట్లో దైవబలం ఎక్కువగా ఉంటుంది. దైవబలం ఎక్కువగా ఉన్న ఇంట్లో దుష్ట శక్తులు ప్రవేశించడానికి ఆస్కారం ఉండదు. అలాగే ఎన్ని ఒత్తిడులు ఉన్నా పూజలు, వ్రతాల ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది.
ఇక దాన ధర్మాలు, ఇరులతో మంచిగా ప్రవర్తించడం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ తోటి వారితో కలిసి మెలిసి ఉండే విధంగా మెలగాలి. ఓ వైపు చెడ్డ పనులు చేస్తూ మరోవైపు పాజిటివ్ ఎనర్జీ కోసం పాకులాడడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మంచి పనుల ద్వారా ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉండడమే కాకుండా తమ జీవితం కూడా బాగుండే అవకాశం ఉంది.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Do this to prevent evil spirits from entering the house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com