Beautiful Life : అందమైన జీవితం పొందాలంటే ఇలా చేయండి..

అయితే కష్టం ఎల్లప్పుడు ఉండదు. చీకటిని చీల్చుతూ వెలుతురు వచ్చినట్టు కష్టాలను తొలగించే సుఖం కూడా వస్తుంది. కానీ మంచి రోజుల కోసం పోరాడాల్సి ఉంటుంది.

Written By: NARESH, Updated On : January 2, 2024 5:54 pm
Follow us on

Beautiful Life : మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. అందులో తెలివైన వారు కొందరు. అతితెలివి ఉన్న వారు మరికొందరు, అమాయకులు ఇంకొందరు ఉంటారు. ఇక కొందరు మాత్రం ప్రతి సారి ఐడియాలు ఇస్తూనే ఉంటారు. కానీ వారు మాత్రం జీవితంలో విజయం సాధించి ఉండరు. అయితే వారు చెప్పే మాటలు మాత్రం గొప్ప గొప్పగా ఉంటాయి. మరి మీరు ఎందుకు సాధించలేదు అనే ప్రశ్న వేస్తే మాత్రం. అదృష్టం బాగలేదు, ఆలోచన చేశాను కానీ ఆచరణలో పెట్టలేదు అంటూ సాకులు చెబుతుంటారు.

వారు జీవితంలో వెనకపడడానికి ముఖ్య కారణం.. తెలివి ఉన్నంత మాత్రాన విజయం రాదు. దానికి కష్టం కూడా తోడుగా ఉండాలి. అయితే విరాట్ కోహ్లీ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ 2006లో ఆడాడు. అదే సమయంలో తన తండ్రి చనిపోయాడు. ఒకవైపు ఎమోషన్, మరో వైపు నాన్న చూపించిన దారి ఈ రెండింటిలో ఏది అంటే చెప్పడం చాలా కష్టం. అదే సమయంలో ఇంటికి వెళ్తావా అని కోచ్ అడిగాడట. కానీ బాధను దిగిమింగుకొని ఆటను ఆడాడు కోహ్లీ. టీమ్ ను గెలిపించడమే కాదు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరుకూడా ఆడలేరు. కానీ నాన్న కలకోసం ఉండిపోయాడు కోహ్లీ. ఈయన పడ్డ కష్టం ఆరోజు కింగ్ ను చేసింది. ఆ రోజు వెనకడుగు వేసుంటే కోహ్లీ జీవితం ఎలా ఉండేదో తెలుసుకోవడం కూడా కష్టమే. ఈయన జీవితాన్ని ఆ మ్యాచ్ మార్చేసింది.

కేవలం కల ఉంటే సరిపోదు. దానికి సరిపడే ప్రయాణం కూడా చేయాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లవచ్చు. లేదంటే గుంపులో గోవిందం లాగా మిగిలిపోవాల్సిందే. నిజానికి కోహ్లీ నిర్ణయం చాలా తెలివైనది. నాన్న అంటే ఎంతో ఇష్టం ఉన్నా కూడా గ్రౌండ్ లో కష్టపడేందుకు బ్యాట్ పట్టుకొని నిలుచున్నాడు. ఆ ఒక్క నిర్ణయమే కోహ్లీని ప్రపంచంలో సూపర్ బ్యాట్స్ మెన్ ను చేసింది. అయితే చాలా మంది జీవితంలో ఇలాంటి పరిస్థితులు వస్తుంటాయి. కానీ అప్పుడు వెనకడుగు వేయకుండా కష్టపడుతూ ముందుకు వెళితే అందరిలో నెంబర్ వన్ గా నిలుస్తారు. లేదా మంచి జీవితాన్ని అయినా పొందుతారు. అంతేకాదు విజయం డోర్ అడ్రస్ వెతుక్కుంటూ మరీ వస్తుంది.

అయితే కష్టం ఎల్లప్పుడు ఉండదు. చీకటిని చీల్చుతూ వెలుతురు వచ్చినట్టు కష్టాలను తొలగించే సుఖం కూడా వస్తుంది. కానీ మంచి రోజుల కోసం పోరాడాల్సి ఉంటుంది. గొంగళి పురుగు తన జీవితం అయిపోయిందని బాధ పడేలోపే సీతాకొక రూపంలో మారి స్వేచ్ఛగా జీవిస్తుంది. అందిరు ఇష్టపడే కీటకంలాగ ఉంటుంది. అందుకే కష్టాలకు భయపడకుండా ఎదురెల్లాలి.