https://oktelugu.com/

Lord Shiva: శివుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి..కార్తీక మాసంలో మరీ మంచిది

ఆ మహాశివుడికి ఏది ఇష్టమో దాన్ని సమర్పించి ఆయన అనుగ్రహం పొందుతున్నారు. ఇక శివుడికి బిల్వ వృక్షం ఆకులన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వులపై సైంటిఫిక్ నేమ్ ఏగిల్ మార్మెలోస్.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 20, 2023 / 03:29 PM IST
    Follow us on

    Lord Shiva: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఒకరైన పరమేశ్వరుడికి సోమవారం అంటే చాలా ఇష్టమైన రోజు. అందుకే సోమవారం నాడు ఎక్కువగా శివున్ని ఆరాధిస్తారు భక్తులు. ఇక ఈ నెల ప్రత్యేకమైన నెల కాబట్టి ఈ కార్తీక మాసాన ప్రతి సోమవారం తెల్లవారు జాము నుంచే పూజలు చేస్తుంటారు. భక్తితో ఆ శివయ్యను కొలుస్తుంటారు. అయితే ఆ మహాశివుడి ఆశీసులు పొందడం అంత ఈజీ కాదు. పూర్వం కఠోర తపస్సులు చేస్తే గానీ స్వామి కరుణించేవారు కాదు. కానీ ప్రస్తుతం అలా చేయడం అంటే చాలా కష్టం. అందుకే ఈ రోజుల్లో భక్తుల ఐడియాలు కూడా మారాయి.

    ఆ మహాశివుడికి ఏది ఇష్టమో దాన్ని సమర్పించి ఆయన అనుగ్రహం పొందుతున్నారు. ఇక శివుడికి బిల్వ వృక్షం ఆకులన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం. ఈ పువ్వులపై సైంటిఫిక్ నేమ్ ఏగిల్ మార్మెలోస్. ఈ పువ్వులు, బిల్వ వృక్షం ఎక్కడంటే అక్కడ కనిపించవు. చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. అందువల్ల మహాశివుని అనుగ్రహం పొందాలంటే ఈ పువ్వులను, ఆకులను సేకరించాల్సిందే. వీటి వల్ల కలిగే ఫలం కూడా అదే రేంజ్ లో ఉంటుందని పండితులు చెబుతుంటారు. దీంతో ఈ ఆకులు, పువ్వుల గురించి తెలిసిన వారు వాటి వేటలో ఉంటారు.

    మీరు జీవితాంతం పూజలన్నింటి ఫలాన్ని ఒక్క బిల్వ పువ్వుతో పూజించడం ద్వారా పొందగలరని పండితుల మాట. అంటే ఈ పువ్వులంటే ఆ మహాశివుడికి అంత మక్కువ. అంతే కాదు వీటి గురించి మరో విశేషం కూడా ఉంది. ఈ పువ్వుతో పూజ చేసిన వారు చనిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తారని ప్రతీతి. ఒక వేళ ఈ పూలు మీకు లభించకపోతే కనీసం బిల్వ ఆకులతో అయినా పూజ చేయవచ్చు. అవి అంటే కూడా స్వామికి విపరీతమైన ఇష్టం అని పండితులు చెబుతుంటారు. ఈ రోజుల్లో ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్లలో ఈ ఆకులు లభిస్తుంటాయి. ఇవి ఎండినా, పచ్చివి అయినా సరే స్వామి కరుణిస్తారు అని ప్రతీతి.