Diabetes Control: రుచికి చేదు పదార్థాలే.. కానీ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి.. అవెంటో తెలుసా?

అల్లనేరుడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహాన్నిఅదుపులో ఉంచడానికి ఇది అనుకూలమైన పండు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ తో పాటు పొటాషియం ఉంటుంది. ఈ పండులో బయోయాక్టిక్ కాంపౌండ్ ఊబకాయాన్నినిరోధించగలదు. అలాగే కడుపులో మంటను తగ్గిస్తుంది.

Written By: Srinivas, Updated On : October 6, 2023 4:54 pm

Diabetes Control

Follow us on

Diabetes Control: కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పడున్న వారిలో చాలా మంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. వంశపారం పర్యంగానో.. కొన్ని రకాల ఆహార పదార్థాలతో రక్తంలో షుగర్ లెవల్ పెరిగి మధుమేహం బారిన పడుతున్నారు. ఈ క్రమంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోడానికి చాలా మంది మెడిసిన్స్ వాడుతున్నారు. మరికొందరు వ్యాయాయం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్ర్తస్తుల్లో షుగర్ లెవల్ పెరగకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికోసం ఎక్కడికో వెళ్లకుండా ఇంట్లో ఉండే పదార్థాలను కొన్ని పద్ధతుల ద్వారా తీసుకోవాలంటున్నారు. వాటిల్లో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాం..

అల్లనేరేడు:
అల్లనేరుడు పండ్లలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మధుమేహాన్నిఅదుపులో ఉంచడానికి ఇది అనుకూలమైన పండు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ తో పాటు పొటాషియం ఉంటుంది. ఈ పండులో బయోయాక్టిక్ కాంపౌండ్ ఊబకాయాన్నినిరోధించగలదు. అలాగే కడుపులో మంటను తగ్గిస్తుంది.

మెంతులు:
మెంతులు షుగర్ లెవల్స్ ను బాగా కంట్రోల్ చేస్తాయి. రక్తంలో ఉండూ గ్లూకోజ్ స్తాయిని ఇవి తగ్గిస్తాయి. మెంతులను ఆహారంలో భాగం చేసుకోవాలి. లేదా కూరల్లో తప్పనిసరిగా వాడాలి. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం బరిగడుపున తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

వెల్లుల్లి:
వంటిట్లో లభించే వెల్లుల్లి షుగర్ ను కంట్రోల్ చేస్తుందంటే ఎవరూ నమ్మరు. కానీ వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇందులో బీ1, బీ3, బీ5, బీ6, బీ9, సీ విటమిన్లు ఉంటాయి. క్యాల్షియం, ఇనుము, మెగ్నీషియం, సోడియం, జంక్ అనే ఖనిజాలు ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియా వెల్లిల్లోలో పుష్కలంగా ఉంటుంది.

ఉసిరి:
కార్తీక మాసంలో ఎక్కువగా కనిపించే ఉసిరి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులో యాంటీ డయాబెటికి్ గుణాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సీ విటమిన్ అధికంగా ఉంటుంది.వీటితో రక్తంలోని చక్కెన నిల్వలను తగ్గిస్తుంది.

వేప:
ఇంటిముందు కనిపించే వేప ఆకులుతినడం వల్లనూ షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. వేప ఆకులతో చేసిన రసాన్ని పరగడుపున తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఆయుర్వేద వైద్యుల ప్రకారం వేప ఆకుల్లో ప్లేవనాయిడ్స్ అనే ఔషధ గుణాలు ఉన్నాయి.వేప రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహంతో బాధపడేవారు ఉపశమనం పొందుతారు.

కాకర:
కాకరకాయను కూర చేసి వండుకొని తింటారు. ఇదిఎక్కువ చేదును కలిగి ఉంటుంది. కానీషుగర్ లెవల్స్ ను తగ్గించడంలో దివ్యౌషధంలా పనిచేస్తుంది. కాకరకాయ రసాన్ని రోజూ పరగడుపున తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.