Naga Dosham: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు మనం చేయకపోయినా.. ఆటోమేటిక్ గా చెడు జరుగుతూ ఉంటాయి. పూర్వ జన్మలో చేసిన తప్పుల వల్లో మరే కారణమో తెలియదు గానీ.. ఒక వ్యక్తి జీవితంలో ఏపని చేసినా అడ్డంకులు ఏర్పడితే కాలసర్పదోషం ఉందని కొందరు పండితులు చెబుతారు. అలాంటి వారు వారి జాతకం ప్రకారం కొన్ని రోజుల పాటు వెయిట్ చేయాలి. ఆ తరువాత ఎటువంటి కొత్త పనులైనా మొదలు పెట్టాలి. అయితే అంతకుముందే నాగదోషం పొవడానికి కొన్ని ప్రత్యేక రోజులు వస్తుంటాయి. ఆరోజుల్లో చేసే ప్రత్యేక పూజలతో ఈ దోషాన్ని నివారించుకోవచ్చని కొందరు పండితులు చెబుతున్నారు. వాటిలో కార్తీక సోమవారం ఒకటి. ఈరోజున ఈ పని చేస్తే కాలసర్పదోషం నుంచి విముక్తి కావడానికి మార్గం ఏర్పడుతుందని అంటున్నారు. ఇంతకీ ఆరోజు ఏం చేయాలి?
కార్తీక మాసం అనగానే.. పూజలు పురస్కాలు అంటారు. ఈ నెల మొత్తం కొందరు ప్రత్యేకంగా ఉపవాసాలు ఉంటారు. ప్రధానంగా శివుడిని కొలుస్తారు. కార్తీక మాసం శివుడికి ప్రీతికరమైనదని, అందుకే శివుడిని పూజించడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని అంటారు. అందుకే కార్తీక మాసంలో ప్రతీ సోమవారం శివుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. 2023 ఏడాది కార్తీక పౌర్ణమి సోమవారం నాడు వచ్చింది. దీంతో ఏడాదిని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
అలాగే ఈ ఏడాది కార్తీక చివరి సోమవారం కూడా విశేషమైనదని అంటున్నారు. ఎందుకంటే ఎన్నో రోజులుగా కాలసర్పదోషంతో బాధపడేవారు కార్తీక మాస చివరి సోమవారం రోజు శివుడిని ఆరాధించాలంటున్నారు. అలాగే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయంటున్నారు. ఈరోజు శివుడిని ఆరాధిస్తూనే నాగదేవతకు ప్రత్యేక పూజలు చేయాలంటున్నారు.ఈరోజున వీలైతే కొన్ని ప్రత్యేక వెండి ఆభరణాలు ధరించడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయంటున్నారు.
కాలసర్పదోషాలు తొలగిపోవాంటే శ్రీకాళహస్తి లేదా నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లో కాలసర్పదోషం పూజలు చేయించుకోవాలని అంటున్నారు. ఈ ఆలయాలకు వెళ్లలేని వారు మహా మృత్యుంజయ మంత్రం, శ్రీ విష్ణు పంచాక్షరి మంత్రాలను పఠించాలి. సర్పదోషం ఉన్న వాళ్లు ఎలాంటి పనులు చేపట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. దారిద్రత్యం తాండవిస్తుంది. ఆర్థికంగా కుంగిపోతారు. అలాంటి వారు కార్తీక చివరి సోమవారం రోజు శివుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేయాలి.