https://oktelugu.com/

wife/husband : ఇలా చేయండి మీ భార్య/భర్త మీరే ప్రాణంగా జీవిస్తారు..

ఈ రోజుల్లో పెళ్లైన జంటలు చాలా మంది ఉద్యోగాలు చేయడం కామన్. భార్యభర్తలిద్దరూ బిజీలైఫ్ ఫుల్ గా గడుపుతున్నారు. తమ వైవాహిక జీవితంలో తగిన సమయం కేటాయించడం కూడా కామన్. దీంతో దంపతుల మధ్య ప్రేమ, సాన్నిహిత్యం తగ్గడం కూడా కామన్ గానే ఉంటుంది. అయితే రాను రాను వైవాహిక జీవితం బోర్ గా కూడా అనిపిస్తుంటుంది. ఈ విషయాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా లైట్ తీసుకోకూవద్దు అంటున్నారు నిపుణులు. ప్రారంభంలో ఇది పెద్దగా అనిపించదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 8, 2024 / 01:47 PM IST

    Do this and your wife/husband will survive.

    Follow us on

    wife/husband : భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారి మీ వైవాహిక జీవితంలో పెద్ద కల్లోలాన్ని సృష్టిస్తుంది అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా గొడవలతో ఆగిపోకుండా లైంగిక జీవితంలో కూడా పెద్ద సమస్యలు వస్తుంటాయి. సంబంధం కొనసాగాలంటే సాన్నిహిత్యం ముఖ్యం. ఇక అన్యోన్యమైన జంటల గురించి చెప్పాలంటే ముందుగా అర్థం చేసుకోవడం, ప్రేమ, గౌరవం చూపించడం అంటారు కదా. అయితే ఈ విషయాలు మాత్రమే కాదు భర్తను, భార్యను ఆటపట్టించడం కూడా ఆరోగ్యకరమైన జంటల లక్షణమే అంటున్నారు కాన్సస్ వర్విటీ పరిశోధకులు. 15వేల మంది మీద ఈ అధ్యయనం చేశారు. దంపతులు మధ్య జరిగే ఫన్నీ మూమెంట్స్ కూడా బంధాన్ని బలపరుస్తాయట. అంతేకాదు ఎగతాళి, ఫన్నీ, కామెంట్లు వంటివి కూడా మీ గుడ్ రిలేషన్ ను సూచిస్తాయి.

    ఉదయాన్నే కొన్ని పనులు చేయడం ద్వారా భార్యభర్తల మధ్య రిలేషన్ బలంగా మారుతుంది. ఇద్దరు కూడా రాత్రి త్వరగా నిద్రపోవడం ఉదయాం పూట త్వరగా నిద్రలేవాలి అంటున్నారు పెద్దలు. ఎందుకంటే ఉదయాన్నే మనసు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఉదయం చేసే పనులు మిమ్మల్ని చాలా యాక్టివ్‌గా ఉంచడానికి సహాయపడతాయి. అందుకే భార్యభర్తలు ఉదయాన్నే కొన్ని పనుల్ని డైలీ రోటీన్‌లో భాగం చేసుకోవడం మంచిది.

    ప్రతి ఒక్కరూ తమ పనిలో బిజీగా మారిపోయారు. అయితే చాలా మంది భార్యభర్తలు ఉద్యోగాల వేటలో పడి కొన్ని సార్లు భాగస్వామిని పట్టించుకోవడం లేదు. ఇక మహిళ గృహిణి అయితే మాత్రం పిల్లలను చూసుకోవడం వంటి పనుల తోనే బిజీగా ఉంటుంది. లేదంటే మాత్రం ఏదో ఒక పనిలో బిజీ అవడం కామన్. కానీ ఈ సమయంలో కొన్ని సార్లు విసుగు వస్తుంది. ఒకరికి ఒకరు సహాయం చేసుకోకపోతే భాగస్వాముల మధ్య దూరం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

    ఈ నేపథ్యంలో ఒకరికొకరు ఉదయం కొన్ని గంటలు తమ కోసం కేటాయించుకోవాలి. వారి రిలేషన్ డబుల్ స్ట్రాంగ్ అవుతుంది. దంపతులు ఉదయం ‘నా సమయాన్ని కాస్తా వీ టైమ్’గా మార్చుకోవాలి అంటున్నారు నిపుణులు. ఉదయాన్నే లేచి టీ లేదా కాఫీతో కబుర్లు చెప్పుకోవడం కూడా చాలా మంచి అలవాటు. మీ ఆలోచనలు, లోపాల్ని ఒకరితో మరొకరు షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అంతేకాకుండా మీ మధ్య జరిగిన మధుర జ్ఞాపకాల్ని నెమరువేసుకోండి. అంతేకాకుండా భార్యభర్తలిద్దరూ మార్నింగ్ వాక్‌కి వెళ్లవచ్చు. మార్నింగ్ వాక్ శరీరానికి మేలు చేస్తుంది. ఇద్దరు కలిసి చేస్తే మీ మధ్య మానసిక బంధాన్ని ఏర్పరుస్తుంది.

    ఉదయాన్నే వంటగదిలో ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోండి.. దీంతో భార్యకు పనిభారం తగ్గుతుంది. అంతేకాదు ఆమె మనసుకు మరింత దగ్గర అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ భార్య ఆఫీస్ కు వెళ్తే కాస్త డ్రాప్ చేయడం కూడ మంచిదే. ఇద్దరూ కలిసి డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లండి. లేదా స్విమ్మింగ్ కి వెళ్లండి. ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేయవచ్చు. ఉదయం పూట ఇద్దరూ కలిసి సైకిల్ తొక్కడం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి, మీ భాగస్వామితో మాట్లాడి, అతని/ఆమె మంచితనాన్ని నిరంతరం అభినందించడం వంటివి చేస్తుంటే రిలేషన్‌షిప్‌లో తాజాదనం అలాగే ఉంటుంది. మరీ ముఖ్యంగా సారీ, థాంక్యూలు చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.