https://oktelugu.com/

Eating Vastu: అన్నం వండేప్పుడు, తినేప్పుడు.. ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే మీకు అన్నం దొరకదు..!

ఎప్పుడైనా సరే అన్నం వండేటప్పుడు శారీరకంగా, మానసికంగా కూడా స్వచ్ఛంగా ఉంటూ వంట చేసుకోవాలి. అలా స్వచ్ఛంగా వంట చేసుకోవడం వలన అన్నపూర్ణా దేవి ఇంట్లో ఉంటుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 11, 2023 / 05:12 PM IST

    Eating

    Follow us on

    Eating: అన్నం పరబ్రహ్మ స్వరూపం. అనాదిగా అన్నం వండేటప్పుడు.. భోజనం చేసేటప్పుడు కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తున్నారు. అయితే కాలక్రమేణా ఆ ఆచారాలను పాటిచేవారు తగ్గుతున్నారు. ఉరుకులు పరుగుల జీవితం.. సంపద పెరగడం, పైసలు పెడితే అన్నీ కాళ్లవద్దకే వస్తాయన్న అతివిశ్వాసంతో సనాతన ఆచారాలు, సంద్రాయాలు పాటించేవారు తగ్గిపోతున్నారు. ఇక పాతకాలం అవ్వ, తాతలు చెప్పినా.. అత్త, మామలు కోడళ్లకు ఇలా చేయకూడదని చెప్పినా ఏంటి చాదస్తం అని.. గృహ హింస అని భావిస్తున్నారు. కాని శాస్త్రం మాత్రం ఆచారాలు పాటించకుంటే ప్రమాదమని చెబుతోంది. అన్నం తినేటప్పుడు, వండేటప్పుడు కొన్ని రూల్స్‌ కచ్చితంగా పాటించాలని సూచిస్తుంది.

    ఇలా చేస్తే అన్నపూర్ణాదేవి ఆశీర్వాదం..
    అన్నాన్ని గౌరవించకపోతే అన్నం పుట్టదని పెద్దలు అంటూ ఉంటారు. ఇలా కనుక మీరు పాటించినట్లయితే ఎల్లప్పుడూ అన్నపూర్ణా దేవి మీ ఇంట్లో ఉంటుంది. మరి అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలిగి, అన్నపూర్ణా దేవి ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే అన్నం వండుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి.

    స్వచ్ఛత ముఖ్యం..
    ఎప్పుడైనా సరే అన్నం వండేటప్పుడు శారీరకంగా, మానసికంగా కూడా స్వచ్ఛంగా ఉంటూ వంట చేసుకోవాలి. అలా స్వచ్ఛంగా వంట చేసుకోవడం వలన అన్నపూర్ణా దేవి ఇంట్లో ఉంటుంది. వండేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపు నిలబడి వంట చేసుకోవాలి. అలాగే హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే ఎప్పుడూ కూడా మనం ఆహారాన్ని గౌరవించాలి.

    తినేటప్పుడు ఈ మంత్రం జపించాలి..
    అన్నాన్ని తినేటప్పుడు కొన్ని మంత్రాలు లేదా శ్లోకాలని చదివి ఆ తర్వాత అన్నాన్ని తినడం మొదలు పెట్టాలి. ఒకసారి దేవుడిని స్మరించుకుని అన్నం తింటే మన ఇంట్లో అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుంది. తూర్పు వైపు కూర్చుని భోజనం తింటే చాలా మంచిది. అన్నం తినేటప్పుడు ఎప్పుడూ ప్రశాంతంగా కూర్చుని తినాలి తప్ప గొడవ పడుతూ తినకూడదు.

    దానం చేయాలి..
    అన్నపూర్ణా దేవి అనుగ్రహం కలగాలంటే అన్నాన్ని మనం దానం చేయాలి. మీ స్తోమతకి తగ్గట్టుగా దానం చేసినట్లయితే మీ ఇంట అన్నపూర్ణా దేవి కొలువై ఉంటుంది. కొన్ని పక్షులకి లేదంటే జంతువులకు కూడా అన్నం ఆహారంగా పెట్టొచ్చు.

    ఇవి చేయకూడదు..
    ఎప్పుడూ కూడా వండిన అన్నాన్ని అవమానించకూడదు. ఎడమ చేతితో భోజనాన్ని తాకకూడదు, తినకూడదు. కుడి చేత్తోనే అన్నాన్ని తినాలి. మంచం మీద కూర్చుని ఆహారాన్ని తీసుకోకూడదు. చేతులు కడుక్కోకుండా ఎప్పుడూ కూడా కంచంలో అన్నం పెట్టుకొని ఆ అన్నాన్ని పారేయకూడదు. ఇలా కచ్చితంగా మీరు వీటిని పాటించినట్లయితే అన్నపూర్ణా దేవి మీ ఇంట ఉంటుంది. డబ్బుకి, అన్నానికి లోటే ఉండదు.