Health Tips: జీవితం ఆనందమయంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్ని మంచి అలవాట్లను పాటించడంలో పొరపాట్లు చేస్తుంటారు. చాలా మంది ఉదయం లేవగానే ఆరోగ్య విషయాలను విస్మరిస్తున్నారు. దీంతో అనేక దీర్ఘ కాలిక వ్యాధులను తెచ్చుకుంటున్నారు. వర్క్ బిజీ తో పాటు సరదాగా ఉండేందుకు మంచి అలవాట్లను దూరం చేసుకుంటూ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటి వెంటపడుతున్నారు. అయితే జీవితంలో క్రమశిక్షణగా ఉండి కొన్ని ఆలవాట్లను మార్చుకుంటే జీవితం సుఖమయంగా మారుతుంది. ముఖ్యంగా ఈ 5 అలవాట్లతో అనేక సమస్యలను పారద్రోలవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఫోన్ కు దూరంగా ఉండడం:
ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ తోనే రోజును ప్రారంభిస్తారు. కొందరు వర్క్ అవసరాలకు.. మరికొందరు సరదాగా కోసం ఫోన్ ను చూడకుండా ఉండలేరు. అయితే ఉదయమే ఫోన్ చూడడం వల్ల కళ్లపై ప్రభావం చూపుతుంది. ఫోన్ నుంచి వెలువడే లైటింగ్ తో కళ్లపై ప్రభావం చూపి తొందరగా సమస్యలు వస్తాయి.
సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి:
ఉదయం లేవగానే చాలా మందికి బద్ధకం ఉంటుంది. ముఖ్యంగా స్నానం చేయడానికి చాలా మందికి మనసు రాదు. అయితే సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల శరీరంలోని జీవక్రియులు సక్రమంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఉదయమే స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారి రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు.
బ్రేక్ ఫాస్ట్ కు బ్రేక్ వద్దు:
పనుల బిజీతో చాలా మంది ఉదయం ఏం తీసుకోకుండానే కార్యాలయాలు వెళ్లారు. కానీ కచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఖాళీ కడుపుతో ఉండడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే కొందరు టీ లేదా కాఫీ తాగి సరిపెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల శరీరం హీటెక్కుటుంది. చల్లటి జ్యూస్ లేదా లైట్ ఫుడ్ కొంచెమైనా తీసుకోవడానికి ప్రయత్నించాలి.
పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి:
చాలా మంది ఉదయం లేవగానే ఏదో భయంతో కూడుకొని ఉంటారు. ఈరోజంతా తమకు అన్ని అశుభాలే అన్నట్లుగా ప్రవర్తిస్తారు. వీటన్నింటిని పక్కకు బెట్టి అంతా మంచే జరుగుతుందని భావించాలి. ఇతరుల చెప్పిన విషయాలను వింటూనే మీకు నచ్చిన విధంగా ఉండాలి.
ప్రీప్లాన్ ముఖ్యం:
ఒకరోజు ఎలాంటి పనులు చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అనే విషయాలపై ప్రీప్లాన్ వేసుకోవాలి. ఈ పని ఉదయమే చేయడం వల్ల క్రమ పద్ధతిలో అన్నీ పనులు పూర్తి చేయగలుగుతారు. లేకుండా సమయభావనలో లోపం ఏర్పడి ఏ పని పూర్తి చేయకుండా ఉంటారు. అందువల్ల ఒకరోజు చేసే పనులకు ప్లానింగ్ తప్పనిసరి.