Tea : తాజాగా టీ తాగే వారికి ఆయుష్షు ఎక్కువ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై కాఫీ, టీ ప్రియుల మధ్య సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకమైన చర్చ మొదలైంది. టీ ప్రియులు దీనిని ‘అమృతం’గా పరిగణిస్తుండగా, కాఫీ ప్రియులు దీనిని ‘టీ ప్రమోషన్’గా కొట్టిపారేస్తున్నారు. ఈ వైరల్ పోస్ట్‌లో అసలు నిజం ఏమిటో తెలుసుకుందాం.
తాజాగా, నేషనల్ జియోగ్రాఫిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘టీ తాగేవారు ఎక్కువ కాలం జీవిస్తారు అనే పోస్ట్‌తో సంచలనం సృష్టించింది. 280 మిలియన్ల మంది అనుచరులతో ఈ ప్లాట్‌ఫారమ్ పోస్ట్ త్వరగా చర్చకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా నీటి తర్వాత అత్యధికంగా వినియోగించే పానీయం టీ అని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ ఈ పానీయాన్ని ప్రచారం చేసింది. ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి మెరుగైన దృష్టి, ఎక్కువ జీవితకాలం, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
టీ vs కాఫీ చర్చ
ఈ పోస్ట్ వైరల్ అయిన వెంటనే, కాఫీ ప్రియులు దీనిని ‘టీ ప్రమోషన్’ అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘కాఫీ తాగేవారిని మర్చిపోకండి, మేము కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటాము అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నారు.’ అదే సమయంలో, మరొక వినియోగదారు, ‘టీ చాలా మంచిదైతే, భారతదేశంలో ప్రతి వ్యక్తి 100 సంవత్సరాలు జీవించాలి అంటూ కామెంట్ చేశారు.
శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని, అయితే ఇది జీవనశైలి, ఆహారం, వ్యాయామంపై కూడా ఆధారపడి ఉంటుందని పోషకాహార నిపుణుడు డాక్టర్ అనురాధ శర్మ చెబుతున్నారు. టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ దానిని అమరత్వ రహస్యంగా పరిగణించడం సరికాదు అంటున్నారు. గ్రీన్ టీ, హెర్బల్ టీ, బ్లాక్ టీ వివిధ ప్రయోజనాలను కలిగి ఉండవచ్చని.. అయితే చక్కెర యాడ్ చేసిన టీని కాస్త లైట్ తీసుకోవడం బెటర్ అంటున్నారు. షుగర్ ఎక్కువగా తీసుకోవద్దు అంటున్నారు.
అల్లం టీ:
అల్లం- నిమ్మకాయ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మారడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కాకుండా, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి లెమన్ టీ చాలా బాగా పని చేస్తుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక కేవలం అల్లం టీ మాత్రమే కాదు గ్రీన్ టీ వంటివి కూడా మీకు మంచి ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఈ విషయం ప్రతి ఒక్కరి విషయంలో సమానంగా ఉండదు. విభిన్నమైన శరీరాలు ఉంటాయి కాబట్టి మీ మీ శరీరాన్ని బట్టి టీ గురించి ఆలోచించాలి. ముఖ్యంగా మీ పర్సనల్ డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది.