Curd : పెరుగు అంటే నచ్చకుండా ఎవరు అయినా ఉంటారా? పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. ఇక అన్నం తిన్న తర్వాత ఒక ముద్ద అయినా సరే పెరుగు తినాలి అనుకుంటారు. శీతాకాలంలో కూడా పెరుగు తినే వారు ఎక్కువ ఉంటారు. చల్లగా ఉండే పెరుగు అయినా సరే కానీ తినాల్సిందే అంటారు. అయితే పెరుగు సాధారణంగా ఆరోగ్యకరమైన, శీతలీకరణ విషయంగా పరిగణిస్తారు. చాలా మందికి ఇష్టం కూడా. అయితే కొన్ని పదార్థాలతో కూడిన పెరుగును తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుందని మీకు తెలుసా? అవును, పెరుగుతో కలిపిన కొన్ని ఆహార పదార్థాలను తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి పెరుగుతో కలిపి తింటే కడుపులో చికాకు కలిగించే ఆ 4 పదార్థాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
పండు – పెరుగు
చాలామంది తమ ఆహారంలో పండ్లు, పెరుగును తరచుగా తీసుకుంటారు. కానీ ఇలా చేయడం చాలా తప్పు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నారింజ, ద్రాక్ష లేదా నిమ్మకాయ వంటి పుల్లని పండ్లతో పెరుగు తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడి జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. పుల్లని పండ్లు, పెరుగు రెండూ వివిధ మార్గాల్లో జీర్ణమవుతాయి, ఇది కడుపులో అసమతుల్యతను కలిగిస్తుంది.
చేప – పెరుగు
చేపలు, పెరుగు కలిపి తినడం వల్ల జీర్ణక్రియ కూడా ఇబ్బంది అవుతుంది. చేపలో ప్రోటీన్ ఉంటుంది. పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండు కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఇలా చేయడం వల్ల గ్యాస్, పొట్టలో భారం వంటి సమస్యలు వస్తాయి.
బంగాళదుంపలు – పెరుగు
బంగాళదుంపలు, పెరుగు మిశ్రమాన్ని తినడం కూడా తరచుగా కడుపు తిమ్మిరి, ఉబ్బరం వంటి సమస్యలను తెస్తుంది. బంగాళాదుంపలో స్టార్చ్, పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి రెండూ కూడా వేర్వేరు జీర్ణమయ్యే మూలకాలు. వీటిని కలిపి తింటే కడుపు నొప్పి వస్తుంది.
చక్కెర – పెరుగు
పెరుగులో పంచదార కలిపి స్వీట్‌గా చేయడం కొందరికి ఇష్టం. కానీ ఈ కలయిక కడుపుకు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. పెరుగును చక్కెరతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. శరీరంలో అలర్జీలు లేదా వాపులు వంటి సమస్యలు వస్తాయి.
జీర్ణ సమస్యలు ఉంటే?
రాత్రిపూట పెరుగు తినడం మంచిదే. అయితే, మీకు ఏవైనా జీర్ణ సమస్యలు ఉంటే, రాత్రిపూట పెరుగు తినడం వల్ల సమస్యలు లేదా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇది కొవ్వు, మాంసకృత్తులతో కూడిన పాల ఉత్పత్తిగా ఉంటుంది. ఇది రాత్రిపూట జీర్ణం కావడం కష్టం. మీ జీర్ణశక్తి కూడా తక్కువగా ఉండవచ్చు.