Parents With Daughter : పిల్లలను పెంచడం అనే బరువులా కాకుండా ఒక బాధ్యతలా తల్లిదండ్రులు ఉండాలి. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లు అయ్యేవరకు వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. స్కూల్‌కి వెళ్లిన వచ్చినంత వరకు వాళ్ల కోసమే ఆలోచిస్తారు. ఒక రెండు నిమిషాలు లేటుగా వస్తే చాలు.. ఏమైంది పిల్లల ఇంకా ఇంటికి రాలేదని టెన్షన్ పడుతుంటారు. అందులోనూ అమ్మాయిలైతే చాలా ఆందోళన చెందుతారు. కొందరు తల్లిదండ్రులు అయితే పిల్లలకు కావాల్సినవన్ని అడగకుండా ఇస్తారు. కానీ అడిగిన ఫ్రిడమ్ మాత్రం ఇవ్వరు. వాళ్లను గారాబంగా చూస్తూ ఎక్కడికి వెళ్లనివ్వరు. కనీసం వీధిలో పిల్లలతో ఆడుకోవడానికి కూడా పంపరు. వాళ్లకి ఏం కావాలో కూడా తెలుసుకోరు. పేరెంట్స్‌గా పిల్లలతో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అందులోనూ అమ్మాయిలతో అయితే ఈ విషయాలు తప్పకుండా చర్చించాలి. అవేంటో చూద్దాం.
పిల్లలను బాధ్యతాయుతంగా పెంచాలి. అందులో అమ్మాయిలని అయితే వాళ్ల ఇబ్బందులు ఏంటో కూడా తెలుసుకోవాలి. అమ్మాయిలను బయటకు పంపంచేటప్పుడు వాళ్లకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయో కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు స్కూల్‌కి లేదా కాలేజీకి పంపించినప్పుడు ఏవైనా ఇబ్బందులకు గురవుతున్నారా అనే మీరు తెలుసుకోవాలి. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను ఏడిపిస్తారు. ఈ విషయం ఇంట్లో చెబితే చదువు మధ్యలో ఆపేసి, పెళ్లి చేసేస్తారు ఏమోనని భయపడి తల్లిదండ్రులకు ఇలాంటి విషయాలు చెప్పరు. ఎందుకంటే అంత అర్థం చేసుకునే పొజిషన్‌లో తల్లిదండ్రులు ఉండరు. అలాగే అమ్మాయిల ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఉంటారో వాళ్ల గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి. అబ్బాయి అమ్మాయి వెంటపడినా అమ్మాయిదే తప్పు అని చదువు మాన్పించేస్తారు. తల్లిదండ్రులే పిల్లలతో కూర్చుని చర్చించాలి. ఇలాంటి విషయాలు ఎవరికీ చెప్పుకోలేక బాధపడుతుంటారు. ఎంతో మంది అమ్మాయిలు ఇలాంటి సమస్యల వల్ల వాళ్ల జీవితాలను కూడా కోల్పోయారు.
తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చిన అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తామనే భరోసా పిల్లలకు ఇవ్వాలి. పిల్లలకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. ఎక్కడికి పంపించకుండా నాలుగు గోడల మధ్య ఉంచడం అంత మంచిది కాదు. దీనివల్ల పిల్లలు డిప్రెషన్‌కి గురవుతారు. అందరితో అంత తొందరగా కలవలేరు. కాబట్టి కుటుంబంతో కలివిడిగా ఉండేలా పిల్లలకు నేర్పించాలి. పిల్లల ముందు కొన్ని విషయాలను చర్చించకూడదు. లింగ బేధంతో ఎప్పుడూ పిల్లలను పెంచవద్దు. చిన్నప్పటి నుంచి మీరు అలా పెంచితే వాళ్లు భవిష్యత్తులో అలానే ప్రవర్తిస్తారు. వాళ్లకు కుటుంబం, తల్లిదండ్రులు, జీవితం విలువ తెలిసేలా పెంచండి. వాళ్లు ఎదిగే కొద్ది వాళ్లకు అన్ని విషయాలు తెలిసేలా చేయండి. పిల్లలను గారాబంగా పెంచితే పర్లేదు. కానీ సోమరిపోతులుగా మాత్రం పెంచవద్దు. మీరు వాళ్లకి అన్ని ఇవ్వండి.. కానీ ప్రతి ఒక్క దాని విలువ తెలిసేలా అంటే ఎంత కష్టపడితే వస్తుందో తెలిసేలా పిల్లలకు ఇవ్వాలి. అప్పుడే వాళ్లు భవిష్యత్తులో బాధ్యతాయుతంగా ఉండి జీవితంలో పైకి వెళ్తారు.
Bhaskar Katiki is the main admin of the website
Read MoreWeb Title: Do parents discuss these things with your daughter
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com