https://oktelugu.com/

Bath : స్నానం చేసిన తరువాత ఇలా అస్సలు చేయవద్దు

ముఖ్యంగా ఇంటి ముఖం ద్వారా చల్లడం ద్వారా ఎటువంటి చెడు వాతావరణం ఇంట్లోకి ప్రవేశించదు. అందువల్ల స్నానం చేసిన తరువాత వీటిని తప్పనిసరిగా చేయాలి.

Written By:
  • NARESH
  • , Updated On : February 25, 2024 / 10:07 AM IST
    Follow us on

    Bath : కొందరు ఎంత డబ్బు సంపాదించినా సంతోషంగా ఉండరు. ఎంత కష్టపడినా అనుకున్నది సాధించరు. అందుకు కారణం ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీనే. చుట్టూ ఇలాంటి పరిస్థితి ఉన్నంతసేపు అనుకున్న పనులు కావు. ఇలాంటివి పోవాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు సంతోషంగా ఉండాలంటే స్నానం చేసిన తరువాత ఈ పనులు తప్పనిసరిగా చేయాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    ప్రతిరోజూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి. ఇందులో భాగంగా స్నానం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. స్నానం చేయడం వల్ల శరీరంలోని అనేక అవయవాలు కదిలి ఆరోగ్యంగా ఉంటారు.ఇదే సమయంలో శుచి శుభ్రత కలిగి చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లదంగా మారుతుంది. అయితే స్నానం చేసిన తరువాత చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని పనులు తప్పనిసరిగా చేయాలి. అవేంటంటే?

    స్నానం చేసిన తరువాత పసుపు నీళ్లను ఇంట్లో చల్లు కోవాలి. ఇలా చల్లడం ద్వారా నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పైగా పసుపు యాంటి సెప్టిక్ గా పనిచేయడం వల్ల వాతావరణంలో ఎలాంటి కలుషితం ఉన్న శుభ్రం అవుతుంది. అలాగే స్నానం చేసిన తరువాత ఉప్పు నీళ్లు చల్లుకోవాలి. ఉప్పునీళ్లతో కూడా చెడు వాతావరణం నుంచి పరిశుభ్రవాతావరణంగా మారుతుంది. పైగా ఉప్పులో ఉండే లక్షణాలు చెడు దృష్టిని ఇంటిపై పడకుండా చేస్తాయి.

    స్నానం చేసిన తరువాత పూజ గదిలో దీపాలు వెలిగించిన తరువాత ఇంట్లో గంగాజలం చల్లుకోవాలి. గంగాజలం ప్రకృతి నుంచి లభించింది. వీటిలో ఆయుర్వేద గుణాలు ఉంటాయి. వీటిని ఇంట్లో చల్లుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా ఇంటి ముఖం ద్వారా చల్లడం ద్వారా ఎటువంటి చెడు వాతావరణం ఇంట్లోకి ప్రవేశించదు. అందువల్ల స్నానం చేసిన తరువాత వీటిని తప్పనిసరిగా చేయాలి.