After Eating: అన్నం తిన్న తరువాత ఈ పనులు చేస్తే.. ఆ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

అన్నం తిన్న తరువాత శరీరం రిలాక్స్ అవుతుంది. కడుపు నిండినట్లయి మెదడు మొద్దువారినట్లవుతుంది. దీంతో వెంటనే నిద్ర వస్తుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తరువాత ఇలా రిలాక్స్ కావడం మంచిదే.

Written By: Chai Muchhata, Updated On : October 27, 2023 4:35 pm

After Eating

Follow us on

After Eating: చిరుతిళ్లు ఎన్ని తిన్నా కొందరికి అన్నం తినకుండా ఉండలేదు. సరైన భోజనం చేసిన తరువాతనే తృప్తి పడుతారు. అయితే ఇష్టమైన వంటకాలతో భోజనం చేసిన తరువాత చాలా మందికి కడుపు నిండినట్లయి వెంటనే రిలాక్స్ అవుతారు. ఈ క్రమంలో ఓ కునుకేస్తారు. కొందరు అలా కళ్లు మూసుకొని రిలాక్స్ అవగా.. మరికొందరు మాత్రం బెడ్ పైకి ఎక్కేస్తారు. ఇంకొందరు సంతోషంగా భోజనం చేసిన తరువాత ఓ దమ్ము కొడుతారు. మరికొందరు ఫ్రూట్స్ తింటారు. ఇలా అన్నం తరువాత ఇలాంటి పనులు చేయొచ్చా? ఇలా చేస్తే ఏం జరుగుతుంది? ఆ వివరాల్లోకి వెళితే..

అన్నం తిన్న తరువాత శరీరం రిలాక్స్ అవుతుంది. కడుపు నిండినట్లయి మెదడు మొద్దువారినట్లవుతుంది. దీంతో వెంటనే నిద్ర వస్తుంది. మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన తరువాత ఇలా రిలాక్స్ కావడం మంచిదే. కానీ అదే పనిగా అన్నం తిన్న వెంటనే బెడ్ పైకి ఎక్కేస్తే మాత్రం ప్రమాదమే. అన్నం తిన్న తరువాత వెంటనే నిద్రపోకూడదు. అలా నిద్ర పోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. తిన్న ఆహారం పరిగా జీర్ణం కాకుండా కొవ్వుగా పేరుకుపోతుంది. ఆ తరువాత అనేక ఆనారోగ్య సమస్యలు వెంటాడుతాయి.

కొందరు అన్నం తిన్నవెంటనే ధూమపానం చేస్తారు. ఇలా చేయడం వల్ల వారి మనసు ఉల్లాసంగా మారుతుందని అనుకుంటారు. కానీ పొగ పీల్చినప్పుడు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ః, అల్సరేటివ్ ప్రేగులో సమస్యలు వస్తాయి. అలాగే పొగ గొంతులోకి వెల్లి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకా డైజేషన్ సమస్యలు తీవ్రమవుతాయి. భోజనం చేసిన తరువాత ఫ్రూట్స్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే పండ్లలో కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న ఆహారాన్ని జీర్ణం కాకుండా చేస్తాయి. ఫలితంగా లావుగా తయారవుతారు.

అయితే భోజనం చేసిన తరువాత ఇలాంటి పనులు కాకుండా కనీసం 30 నిమిషాల పాటు అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. తిన్న వెంటనే కాకుండా కనీసం రెండు గంటల తరువాత నిద్రపోవాలి. అంతకుముందే ప్లాన్ వేసుకొని ముందుగానే తినేయాలి. తినేటప్పుడు ఎక్కువగా నీరు తాగకూడదు. కనీసం అరగంట ఆగిన తరువాత ఎక్కువ నీరు తీసుకోవాలి. అప్పుడే ఎలాంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.