https://oktelugu.com/

After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయకూడదు

భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు. టీ తాగడం వల్ల యాసిడ్ విడుదలై మనం తిన్న పదార్థం జీర్ణం కాదు. దీంతో గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వస్తాయి. అజీర్తి బాధపెడుతుంది. భోజనం తరువాత సిగరెట్ కాల్చడం మంచిది కాదు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకా తిన్న తరువాత బెల్ట్ లూజు చేయకూడదు. అలా చేయడం వల్ల ఎక్కడైనా ఆహారం ఇరుక్కుని ఉంటే సరిగా అరగదు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2023 / 01:06 PM IST

    After Eating

    Follow us on

    After Eating: మనం ప్రతి రోజు మూడు పూటల ఏదో ఒకటి తింటాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కూడా భోజనం చేయడం సహజం. భోజనం చేసిన తరువాత కొన్ని పనులు చేయకూడదు. ఒకవేళ చేస్తే దాని వల్ల దుష్ఫలితాలు కలుగుతాయి. భోజనం చేసిన తరువాత ఈ పనులు చేస్తే చిక్కుల్లో పడటం ఖాయం. అందుకే మనం భోజనం చేసిన తరువాత ఎలాంటి పనులు పెట్టుకోకూడదు. చక్కగా విశ్రాంతి తీసుకుంటే చాలా ఉత్తమం.

    టీ తాగకూడదు

    భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు. టీ తాగడం వల్ల యాసిడ్ విడుదలై మనం తిన్న పదార్థం జీర్ణం కాదు. దీంతో గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వస్తాయి. అజీర్తి బాధపెడుతుంది. భోజనం తరువాత సిగరెట్ కాల్చడం మంచిది కాదు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇంకా తిన్న తరువాత బెల్ట్ లూజు చేయకూడదు. అలా చేయడం వల్ల ఎక్కడైనా ఆహారం ఇరుక్కుని ఉంటే సరిగా అరగదు.

    పండ్లు తినకూడదు

    భోజనం చేసిన తరువాత పండ్లు తినకూడదు. దీంతో కడుపులో గాలి నిండుతుంది. ఒకవేళ పండ్లు తినాలనిపిస్తే భోజనానికి గంట ముందు కానీ భోజనం తరువాత గంట అయ్యాక కానీ తినాలి. లేదంటే ఇబ్బందులు ఏర్పడతాయి. భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. దీని వల్ల కాళ్లు, చేతులకు రక్తసరఫరా ఎక్కువై జీర్ణ ప్రక్రియ ఆగిపోతుంది. భోజనం తరువాత నిద్రపోవడం కూడా మంచిది కాదు.

    నిద్రపోకూడదు

    తిన్న వెంటనే నిద్ర పోతే కూడా కష్టంగా మారుతుంది. తిన్న ఆహారం జీర్ణం కాదు. గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. నిద్ర ఆగనట్లయితే పదినిమిషాలు పడుకుని లేచి కాస్త అటు ఇటు నడవాలి. అంతేకాని తిన్న తరువాత నిద్రకు ఉపక్రమిస్తే మనం రోగాల బారిన పడినట్లే. భోజనం చేశాక ఇలాంటి తప్పులు చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.