https://oktelugu.com/

Parenting Tips: చిన్న పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నారా? కారణం ఇదే..

చిన్న పిల్లలకు కొందరు టైట్ గా ఉండే దుస్తులు వేస్తారు. పెద్దవాళ్లు అయితే వారి సమస్యను తెలుపుతారు. కానీ చిన్న పిల్లలకు చెప్పడం రాదు. దీంతో వారు కంటిన్యూగా ఏడుస్తూ ఉంటారు. ఈ విషయం అర్థం కాక చాలా మంది తల్లులు చిరాకు పడుతుంటారు.

Written By: Srinivas, Updated On : November 7, 2023 5:30 pm
Parenting Tips

Parenting Tips

Follow us on

Parenting Tips: చిన్న పిల్లలను పెంచడం అంటే మాములు విషయం కాదు. వారికి ఏం కావాలో చెప్పలేరు. వారికి ఏం ఇవ్వాలో అర్థం కాదు. ఇలాంటి సమయంలో పెద్దవాళ్లు పక్కన ఉన్నవారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. వారి అనుభవం ప్రకారం పిల్లలక ఏం కావాలో అర్థం చేసుకొని వారికి కావాల్సింది ఇచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. కానీ నేటికాలంలో చాలా మంది తల్లిదండ్రలు, అత్తమామలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పాప లేదా బాబు జన్మిస్తే వారిని పెంచడం, అర్థం చేసుకోవడం గగనంగా మారుతుంది. ముఖ్యంగా ఒక్కోసారి వాళ్లు అదేపనిగా ఏడుస్తూ ఉంటారు. ఏదో అసౌకర్యం కలగడం వల్లే వారికి ఏం తోచక ఏడుస్తుంటారు. అయితే పిల్లలు ప్రధానంగా ఈ కారణాలతో ఎక్కువగా ఏడుస్తారని కొందరు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

బిగుతుగా ఉండే బట్టలు:
చిన్న పిల్లలకు కొందరు టైట్ గా ఉండే దుస్తులు వేస్తారు. పెద్దవాళ్లు అయితే వారి సమస్యను తెలుపుతారు. కానీ చిన్న పిల్లలకు చెప్పడం రాదు. దీంతో వారు కంటిన్యూగా ఏడుస్తూ ఉంటారు. ఈ విషయం అర్థం కాక చాలా మంది తల్లులు చిరాకు పడుతుంటారు. అందువల్ల ముందే వారికి వదులుగా ఉండే దుస్తులు వేయడం మంచింది.

కారం.. కడుపుమంట:
పిల్లలు నేరుగా ఎటువంటి ఆహారాన్ని తీసుకోరు. తల్లి పాలే వారికి సరైన ఆహారం. అలాంటప్పుడు తల్లలు ఆహారాన్ని తీసుకునేటప్పుడు పిల్లల గురించి కూడా వారు ఆలోచించాలి. ఎటువంటి కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దు. ఇలా తింటే పిల్లలకు పాల ద్వారా వెళ్లి వారి కడుపులో మంట లేస్తుంది. దీంతో పిల్లలు అదే పనిగా ఏడుస్తారు.

కడుపు ఉబ్బరం.. అజీర్ణం:
కొందరు పిల్లలు పాలు తమకు తెలియకుండా ఎక్కువగా తీసుకుంటారు. దీంతో అవి కడుపు నొప్పికి దారి తీస్తాయి. ఇవి వెంటనే జీర్ణం కాకుండా ఉంటాయి. దీంతో పాలు అరగకపోవడంతో అసౌకర్యానికి ఫీలయై ఏడుస్తూ ఉంటారు. ఈ విషయాన్ని గుర్తించి వెంటనే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

పక్కతడపడం:
చాలా మంది పిల్లలు సమయ పాలన లేకుండా పక్క తడుపుతూ ఉంటారు. ఇది అసౌకర్యానికి గురైన ఏడుస్తూ ఉంటారు. అయితే ముందుగా వారు పక్కడ తడిపారా? లేదా? అనేది చూసుకున్న తరువాతే ఎందుకు ఏడుస్తున్నారు? అనేది గుర్తించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారికి ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.