Disorder: ఎక్కువగా పని చేసినా లేకపోతే, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోయిన కొందరికి బాడీలో మార్పులు వస్తాయి. జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ ఏవైనా చిన్న సమస్యలతో బాధపడుతుంటారు. ఉదాహరణకు జ్వరం, జలుబు, దగ్గు వంటివి కామన్. అయితే ఇవి కాకుండా కొందరికి తెలియకుండా కొన్ని మార్పులు బాడీలో కనిపిస్తాయి. శరీరంలో కనిపించే చిన్న మార్పులకు కూడా కొందరు ఆందోళన చెందడం, ఇతరులను చూసి బాధపడటం, వారు ఆరోగ్యంగా ఉన్నారని.. నేను ఎందుకు అలా లేనని పోల్చుకుంటారు. మానసికంగా, శారీరకం ఏ చిన్న సమస్య వచ్చిన కూడా ఎక్కువగా ఒత్తిడికి గురవుతారు. శరీరంలో మార్పులు వస్తున్నాయి? ఆరోగ్యం బాలేదని బాధపడి, ఎక్కువగా టెన్షన్ తీసుకుని ఇంకా సమస్యలను పెంచుకుంటారు. అయితే శరీరంలో మార్పులు అనేవి సహజం. కానీ కొన్నిసార్లు ఆ మార్పులు వల్ల వచ్చే లక్షణాలు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ లక్షణాలేంటి? దీని నుంచి విముక్తి పొందడం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొందరికి అన్ని కూడా ఏదో తక్కువ అయ్యిందని ఫీల్ అవుతుంటారు. జీవితంలో ఏదో వెలితిగా ఉందని, నా జీవితం ఇంతే, ఇక జన్మలో మారదని తెగ ఫీల్ అయిపోతుంటారు. అద్దంలో చూసుకుని ఇష్టం లేనట్టు అనుకోవడం, మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి గురికావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ అని అంటారు. ఈ డిజార్డర్ బారిన పడిన వారు ఎక్కువగా సోషల్ మీడియా, చుట్టూ జరిగే విషయాలు వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే సోషల్ మీడియా లేదా బయట సంతోషంగా ఉన్నవారిని చూసి, వారితో పోల్చుకుని బాధపడుతుంటారు. కొందరు ఎక్కువగా అభద్రతా భావానికి గురికావడం వల్ల ఈ డిజార్డర్ వస్తుంది. అలాగే జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రతీ చిన్న విషయానికి కూడా టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా ముఖంపై చిన్న పుట్టుమచ్చ వచ్చిన కూడా బాధపడుతుంటారు. వారిలోనే కుంగిపోయి.. ఎందుకు ఈ జీవితం అని ఫీల్ అవుతుంటారు. ఈ విషయాలను పదే పదే ఆలోచించి కుంగిపోతుంటారు. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ బాడీ డిస్మోర్ఫిక్ డిజార్డర్ నుంచి బయట పడాలంటే మీకు మీరే డైవర్ట్ కావాలి. ఒంటరిగా ఉంటూ బాధపడకుండా అందరితో కలిసి ఉండాలి. అలాగే కుటుంబంతో సమయం ఎక్కువగా గడపడం, అలాంటి ఆలోచనలను ఏదో విధంగా డైవర్ట్ చేయడం చేయాలి. ఈ డిజార్డర్‌కి ఎక్కువగా కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ, యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందులతో చికిత్స చేస్తారు. ఇలా మందులతో చికిత్స కంటే సొంతంగా అలవాట్లు మారుస్తూ తగ్గించుకోవాలి. అప్పటికీ కూడా సమస్య తగ్గకపోతే అప్పుడు మందుల ద్వారా తగ్గించుకోవాలి. అలాగే యోగా, మెడిటేషన్, వ్యాయామం చేయడం, పాటలు వినడం, డ్యాన్స్ చేయడం వంటివి చేస్తుంటే సమస్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.