Dinner: పూర్వం రోజులతో పోలిస్తే ఈ రోజుల్లో పూర్తిగా జీవనశైలి మారిపోయింది. ఎప్పుడు లేవడం, నిద్రపోవడం, భోజనం ఆలస్యంగా చేయడం వంటివి చేస్తున్నారు. వ్యక్తిగత పనుల్లో బిజీ అయిపోయి కనీసం ఆహార విషయంలో జాగ్రత్త వహించరు. ప్రస్తుతం చాలా మంది రాత్రి పూట తొందరగా కంటే ఆలస్యంగానే భోజనం చేస్తున్నారు. కొందరు అయితే అర్థరాత్రి కూడా భోజనం చేస్తున్నారు. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు. రాత్రిపూట ఆలస్యంగా తింటే జీర్ణ సమస్యలు, గుండె పోటు వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్వం అయితే రాత్రి 7 గంటలకే భోజనం చేసి 9 గంటలకు నిద్రపోయేవారు. కానీ ఈ రోజుల్లో భోజనం చేయడమే 11 గంటలకు చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఆలస్యంగా కాకుండా రాత్రిపూట తొందరగా భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి రాత్రిపూట 7 గంటలకు భోజనం చేస్తే శరీర ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణక్రియ ఆరోగ్యం
రాత్రిపూట 7 గంటలకు తినడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. మీరు నిద్రపోయే సమయానికి తిన్న ఆహారం అంతా జీర్ణం అవుతుంది. దీంతో హాయిగా నిద్ర కూడా పడుతుంది. అదే రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆలస్యంగా చేయడం వల్ల శరీర ఆరోగ్యం మందగించడం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి రాత్రిపూట 7 గంటలకు భోజనం పూర్తయ్యేలా ప్లాన్ చేసుకోండి.
హాయిగా నిద్ర పడుతుంది
తొందరగా తినడం వల్ల ఫుడ్ జీర్ణం అవుతుంది. దీంతో రాత్రిపూట నిద్రకు భంగం కలగదు. నిద్ర లేకపోతే రోజంతా నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ఆలస్యంగా కాకుండా తొందరగా తినడం అలవాటు చేసుకోండి.
ఊబకాయం బారి నుంచి విముక్తి పొందడం
రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కొందరు ఊబకాయం బారిన పడుతున్నారు. అదే తొందరగా భోజనం చేస్తే ఈజీగా బరువు తగ్గుతారు. తొందరగా తింటే తినే ఆహారం జీర్ణం కావడంతో బరువు తగ్గుతారు. కొందరు రాత్రిపూట జంక్ ఫుడ్ తింటారు. వీటివల్ల ఊబకాయం బారిన పడుతుంటారు. కాబట్టి తొందరగా భోజనం చేస్తే జంక్ ఫుడ్ తినాలనే ఆలోచన కూడా రాదు.
చక్కెర స్థాయిలు నియంత్రణలో..
రాత్రిపూట ఆలస్యంగా భోజం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అదే సరైన సమయానికి భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే గుండె జబ్బులు వంటివి రాకుండా కూడా కాపాడుతుంది. కాబట్టి డైలీ 7 గంటలకు తప్పకుండా భోజనం పూర్తయ్యేలా అలవాటు చేసుకోవడం ఆరోగ్యానికి కూడా మంచిది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.