Digest Issues: ప్రస్తుతం రోజుల్లో చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, మారిన జీవనశైలి, ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరు అసిడిటీ, జీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కువగా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. ఫుడ్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. తినే ఫుడ్ సరిగ్గా జీర్ణం కాకపోతే కడుపు నొప్పి, ఉబ్బరం, నీరసం, అలసట అన్ని వస్తాయి. తినే ఫుడ్ జీర్ణం కాకపోతే మళ్లీ ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేరు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి కావాలంటే ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలను తీసుకోవాలి. అందులో ముఖ్యంగా సెలెరీ టీని తప్పకుండా తాగాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సెలెరీ టీ ప్రయోజనాలు ఏంటి? ఈ టీతో జీర్ణ సమస్యల నుంచి విముక్తి చెందడం ఎలాగో తెలుసుకుందాం.
జీర్ణ సమస్యలు
ఉదయం పూట రోజూ సెలెరీ టీ తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి తొందరగా విముక్తి చెందుతారు. ఎన్ని మందులు వాడిన కూడా జీర్ణ సమస్యలు తగ్గకపోతే ఈ సెలెరీ టీ బాగా ఉపయోగపడుతుంది. అవసరమైతే సాయంత్రం కూడా ఈ టీని తాగవచ్చు. ఈ టీ మార్కెట్లో దొరుకుతుంది.
బరువు తగ్గవచ్చు
రోజూ ఉదయం సెలెరీ టీని తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఒక వారం రోజుల పాటు ఈ టీ తాగడం వల్ల పొట్ట ఈజీగా కరిగిపోతుంది. కొందరు రోజూ టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఈ టీకి బదులు సెలెరీ టీ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు.
గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం
గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సెలెరీ టీ బాగా ఉపయోగపడుతుంది. ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల గ్యాస్ సమస్యల నుంచి తొందరగా ఉపశమనం పొందుతారు. అలాగే మలబద్ధకం సమస్య నుంచి కూడా ఉపశమనం పొందుతారని వైద్య నిపుణులు అంటున్నారు.
పీరియడ్స్ నొప్పి నుంచి విముక్తి
నెలసరిలో పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వస్తుంది. దీని నుంచి విముక్తి చెందడానికి సెలెరీ టీ బాగా ఉపయోగపడుతుంది. పీరియడ్స్ సమయంలో రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల టీ తాగితే తొందరగా విముక్తి చెందుతారు.
ఉబ్బసం రాకుండా సాయం చేస్తాయి
ఆస్తమా రోగులు సెలెరీ టీ తాగడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది. ఆస్తమా రోగులకు సెలెరీ టీ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం, సాయంత్రం వేళలో ఈ టీ తాగడం వల్ల ఉబ్బసం సమస్య తగ్గుతుంది.
ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు
కొందరు వ్యక్తిగత సమస్యల వల్ల ఆందోళన, ఒత్తిడి వల్ల డిప్రెషన్‌లోకి వెళ్తుంటారు. ఇలాంటి వాళ్లు ఒత్తిడి నుంచి విముక్తి చెందాలంటే రోజూ ఈ సెలెరీ టీ తాగాలని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.