
Money : ఇటీవల కాలంలో ఎంత కష్టపడినా డబ్బు దొరకడం లేదు. ఎంత సంపాదించినా నెలంతా కష్టాలే కనిపిస్తున్నాయి. చేతిలో చిల్లి గవ్వ ఉండటం లేదు. ఫలితంగా ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. డబ్బు వస్తున్నా నిలవడం లేదు. ఏదో ఒక రూపంలో డబ్బు వస్తున్నా ఏవో అవసరాలకు ఖర్చు అయిపోతోంది. ఈ నేపథ్యంలో డబ్బు ఇంట్లో నిలవాలంటే ఏం చేయాలి? అనే ఆలోచనలో పడుతున్నారు. డబ్బుతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. అందుకే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనమేరా అన్నిటికి మూలం. ధనం లేకపోతే నడవదు సంసారం. దీంతో డబ్బు ఇంట్లో ఉండాలంటే ఏ పరిహారాలు చేయాలని ఆలోచిస్తున్నారు.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఓ చిన్న చిట్కా పాటించండి. దీంతో మన దగ్గర డబ్బుకు లోటుండదు. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శుక్రవారం రోజు ఒక మట్టి జాడీని తీసుకోండి. అమ్మవారికి పూజ చేసిన అనంరం నైవేద్యం సమర్పించిన తరువాత ఒక రాగి పళ్లెం లేదా ఇత్తడి ప్లేటు తీసుకుని అందులో నూతన పసుపు వస్త్రం ఉంచాలి. దానిపై 9 వక్కలు, ఒక పసుపు కొమ్ము, బంగారం లేదా వెండి ఉంగరం లేదా నాణెం ఉంచి మూట కట్టాలి. దాన్ని మట్టి జాడి అడుగులో పెట్టి దానిపై రాళ్ల ఉప్పు పోయాలి.
అందులో పోసిన రాళ్ల ఉప్పును మనం వంటల్లో వాడాలి. రెండు వారాల వ్యవధిలోనే మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. పసుపు వస్త్రం అందుబాటులో లేని వారు తెల్లటి వస్ర్రాన్ని కూడా పసుపు నీటిలో నానబెడితే పసుపు వర్ణం వస్తుంది. వెండి, బంగారం నాణేలు లేనివారు చిన్న బంగారం ముక్కనైనా వేయాలి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడేవారు ఈ చిట్కా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పగలు రాత్రి అనే తేడా లేకుండా చాలా మంది కష్టపడుతున్నారు. డబ్బు సంపాదించాలనే యవతో అన్నిటిని త్యాగం చేస్తున్నారు. పుట్టిన సంతానం ఎదిగే క్రమంలో సామాన్యడు ఎన్నో బాధలు అనుభవిస్తున్నాడు. దీంతో వారి బాధలన్ని పోవాలంటే ఇలాంటి సులభమైన చిట్కా పాటించి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తులు అయ్యేందుకు ప్రయత్నిస్తే సరి. ఈ పరిహారం చేస్తే ధనానికి లోటుండదు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలాంటి చిట్కాలు పాటిస్తూ తమ సమస్యలను దూరం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.