
Apples Benefits: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు పోవాల్సిన అవసరం ఉండదు అని చెబుతారు. యాపిల్ లో అంతటి పోషకాలు ఉంటాయి. అందుకే మనం రోజువారీగా యాపిల్ ను తింటే మంచి ఫలితాలు వస్తాయి. మన ఆరోగ్య సంరక్షణలో యాపిల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ప్రభావంతో చాలా మంది పలు రోగాలతో బాధపడుతున్నారు. అనవసరమైన కొవ్వు (ఎల్డీఎల్) పెరగడంతో గుండె జబ్బుల ముప్పు ఏర్పడుతోంది. ఫలితంగా ఎన్నో రకాల సమస్యలకు నిలయంగా అవుతున్నారు. దీంతో గుండెజబ్బుల ప్రమాదంలో పడిపోతున్నారు. దీని వల్ల చెడు కొవ్వును తొలగించుకునే క్రమంలో మనం జాగ్రత్తలు తీసుకోక తప్పదు.
ఎల్ డీఎల్ తో ఇబ్బందులే..
చెడు కొలెస్ట్రాల్ తో గుండెకు ముప్పు వస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడంతో రక్తసరఫరాలో లోపం ఏర్పడి గుండెపోటు వచ్చే సూచనలుంటాయి. దీంతో చెడు కొవ్వును తగ్గించుకునే ఆహారాలను తీసుకోవాలి. దీన్ని నియంత్రణలో ఉంచే ఔషధంగా యాపిల్ పనిచేస్తుంది. రోజుో రెండు యాపిల్స్ తింటే చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతున్నాయని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం రోజు రెండు యాపిల్స్ తీసుకుని మన గుండెను కాపాడుకోవాలి.
ఎల్ డీఎల్ పెరగకుండా..
రక్తంలో ఎల్ డీఎల్ పెరిగినప్పుడు హెచ్ డీఎల్ సిరల్లో పేరుకుపోతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. యాపిల్స్ తీసుకోవడం వల్ల ఎల్ డీఎల్ ను నియంత్రిస్తుంది. దీని వల్ల గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. శరీరంలో మొత్తం కొలెస్ట్రాల్ సాధారణ స్థాయి 200 ఎంజీ కంటే తక్కువగా ఉండాలి. ఇందులో ఎల్ డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయి 100 ఎంజీ కంటే తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ హెచ్ డీఎల్ 60 ఎంజీ కంటే ఎక్కువగా ఉండాలి. ఇలా ఉంటే రక్తప్రసరణ బాగుంటుంది. గుండెకు ఎలాంటి ఆపద ఉండదు. గుండె ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి ముప్పు ఉండదు. ఇతర వ్యాధుల భయం కూడా రాదు.
యాపిల్ తినడం వల్ల..
రోజు రెండు యాపిల్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య ఉండదా? అంటే నిపుణులు ఉండదనే చెబుతున్నారు. ఇలా యాపిల్స్ తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా 40 శాతం తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. దీనివల్ల యాపిల్ లో ఉండే పోషకాల ప్రభావంతో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మనకు రక్షణగా నిలుస్తుంది. పాలీపెనాల్స్, ఫైబర్ మన శరీరంలోని కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. కాలేయంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. అదనపు కొవ్వను కరిగిస్తుంది.

వృద్ధులకు ఎంతో ప్రయోజనం
యాపిల్స్ తినడం వల్ల వృద్ధులకు ఎంతో మేలు కలుగుతుంది. తాజా అధ్యయనంలో చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో యాపిల్ ప్రధానంగా సాయపడుతుందని తేలింది. యాపిల్ తినడం వల్ల గుండెపోటు, పక్షవాతం రాకుండా నిరోధిస్తుందని చెబుతున్నారు. రక్తనాళాలు రిలాక్సయి రక్తప్రసరణ బాగా జరిగేందుకు ఇవి దోహదపడతాయి. దీంతోపాటు ప్రతిరోజు ఓ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. మాంసాహారం మితంగానే తీసుకోవాలి. జీవన శైలిని మార్చుకుంటే కచ్చితంగా మనకు గుండెజబ్బుల ముప్పు రాకుండా ఉంటుందని వెల్లడిస్తున్నారు.