https://oktelugu.com/

Diabetes: ఈ పువ్వుల పొడితో.. టైప్ 2 డయాబెటిస్‌ నుంచి విముక్తి

సతత హరిత పువ్వులతో మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఈ ఆకులు, పువ్వులతో ఎలా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 30, 2024 / 02:15 AM IST

    Diabetes

    Follow us on

    Diabetes: ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే సరైన డైట్ పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. పెద్ద సమస్య కాదని కొందరు ఫీల్ అవుతుంటారు. కానీ షుగర్ ఉంటే ఇతర ఏ సమస్య వచ్చిన సీరియస్ అవుతుంది. చిన్నగా ఉన్న సమస్యను మీరే పెద్దది చేసుకున్న వారు అవుతారు. అయితే తినే ఆహారంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండటం వల్ల తొందరగా మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఆహార విషయంలో సరిగ్గా నియమాలు పాటించకుండా, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. దీనికి తోడు సాఫ్ట్ డ్రింక్స్, మద్యపానం, ధూమపానం, ఆర్టిఫిషియల్ షుగర్ వంటివి తీసుకోవడం వల్ల చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఆహార విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మధుమేహం తీవ్రం అవుతుంది. ఈ సమస్య పెరిగితే కొన్నిసార్లు ఆరోగ్యానికే ప్రమాదం. అయితే మధుమేహాన్ని నియంత్రించుకోవాలంటే కొన్ని రకాల పువ్వులు కూడా బాగా ఉపయోగపడతాయి. అలాంటి వాటిలో సతత హరిత పువ్వులు ఒకటి. వీటితో మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. మరి ఈ ఆకులు, పువ్వులతో ఎలా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చో తెలుసుకుందాం.

     

    కొన్ని మొక్కలను ఇంట్లోనే కుండీల్లో పెంచుకోవచ్చు. ఇలా పెంచుకోవడం వల్ల ఆరోగ్యాన్నిచ్చే స్వచ్ఛమైన గాలి కూడా ఉంటుంది. అయితే ఇంట్లో చిన్న కుండీల్లో సతత హరిత మొక్కలను పెంచుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌ నుంచి విముక్తి చెందవచ్చు. రెండు పువ్వులు, ఆకులతో ఉన్న ఈ మొక్క ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ మొక్క పువ్వులు లేదా ఆకులను రోజూ నమలడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు బయటకు వస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ మొక్క ఆకులు లేదా పువ్వుల పొడిని తయారు చేసుకుని నీటిలో కలిపి తాగితే టైప్ 2 డయాబెటిస్ కూడా తగ్గుతుంది. అలాగే ఏదైనా కూరగాయల జ్యూస్ చేసుకుని తాగేటప్పుడు ఈ సతత హరిత పువ్వులు, ఆకులు వేసి తయారు చేసుకోవాలి. పువ్వులు లేకపోతే ఆకులు వేసి అయిన జ్యూస్ చేసి తాగితే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి.

     

    ఈ ఆకులు, పువ్వులు మీకు డైలీ దొరకవని అనుకుంటే వీటిని బాగా ఎండ బెట్టుకోవాలి. బాగా ఎండిన తర్వాత వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ ఒక రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ పౌడర్‌ను గ్లాసు నీటిలో టేబుల్ స్పూన్ కలిపి తాగితే మధుమేహం నుంచి రిలీఫ్ ఉంటుంది. ఇందులోని పోషకాలు డయాబెటిస్‌ను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఆల్కలాయిడ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. డైలీ తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.