https://oktelugu.com/

Diabetic: మధుమేహం ఉన్నవారు ఈ దుంపలు తినవచ్చా? తింటే ఏమవుతుంది?

సాధారణంగా స్వీట్ పొటాటో ఆరోగ్యానికి మంచిదే. మరి మధుమేహం ఉన్నవారు స్వీట్ పొటాటో తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 12, 2024 9:05 pm
    Sweet Potato

    Sweet Potato

    Follow us on

    Diabetic: ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే సరైన డైట్ పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. పెద్ద సమస్య కాదని కొందరు ఫీల్ అయిన కూడా షుగర్ ఉంటే ఇతర ఏ సమస్య వచ్చిన పెద్దగానే కనిపిస్తుంది. అయితే తినే ఆహారంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉంటే తొందరగా మధుమేహం వస్తుంది. ఈ రోజుల్లో ఆహార విషయంలో నియమాలు పాటించకుండా, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, సాఫ్ట్ డ్రింక్స్, మద్యపానం, ధూమపానం, ఆర్టిఫిషియల్ షుగర్ వంటివి తీసుకోవడం వల్ల చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి సరైన చికిత్స అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. ఆహార నియమాలు పాటించాలి. అయితే కొందరికి తెలియక మధుమేహం ఉన్నవారు స్వీట్ పొటాటో తింటుంటారు. సాధారణంగా స్వీట్ పొటాటో ఆరోగ్యానికి మంచిదే. మరి మధుమేహం ఉన్నవారు స్వీట్ పొటాటో తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుందో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

     

    సాధారణంగా మధుమేహం ఉన్నవారు తీపి పదార్థాలు అసలు తినకూడదు. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణానికి కూడా ప్రమాదం. అయితే మధుమేహం ఉన్నవారు స్వీట్ పొటాటో తినకూడదని అనుకుంటారు. ఎందుకంటే ఇది తీపిగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని భావిస్తారు. కానీ వీటిని మధుమేహం ఉన్నవారు తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఇందులో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కానీ ఇందులోని ఫైబర్ చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. ఇందులోని ఆంథోసైనిన్స్ అనే పాలీఫెనోలిక్ ఇన్సులిన్‌ను నియంత్రిస్తుంది. ఇందులోని ఫైబర్, మెగ్నీషియం వంటి పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఎలాంటి సందేహం లేకుండా మధుమేహం ఉన్నవారు స్వీట్ పొటాటోను తినవచ్చు. అయితే ఎక్కువగా తినకుండా కాస్త లిమిట్‌లో మాత్రమే మధుమేహం ఉన్నవారు వీటిని తినాలని నిపుణులు చెబుతున్నారు.

     

    డైలీ స్వీట్ పొటాటో తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యల బారిన నుంచి విముక్తి కల్పిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా స్వీట్ పొటాటో బాగా ఉపయోగపడుతుంది. వీటివల్ల కండరాలు, ఎముకలు బలంగా ఉంటాయి. ఈ స్వీట్ పొటాటోను ఉడికించి లేదా ఆవిరిలో ఉడికించి కూడా తినవచ్చు. కొందరు ఈ స్వీట్ పొటాటోను కాల్చి కూడా తింటారు. ఇలా తినడం వల్ల టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొందరు వీటిని కూర వండటం లేదా సాంబారు, రసంలో కూడా వేస్తుంటారు. వీటిని వేయడం వల్ల వంటలు కూడా టేస్టీగా ఉంటాయి. పూర్వకాలంలో ఎక్కువగా అన్ని కూరగాయలు కలిపి వండేవారు. అందులో స్వీట్ పొటాటోను తప్పకుండా వేస్తారు. కానీ ఈరోజుల్లో వీటి వాడకం చాలా వరకు తగ్గిపోయింది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.