Diabetic: ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే సరైన డైట్ పాటించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. పెద్ద సమస్య కాదని కొందరు ఫీల్ అయిన కూడా షుగర్ ఉంటే ఇతర ఏ సమస్య వచ్చిన పెద్దగానే కనిపిస్తుంది. అయితే తినే ఆహారంలో చక్కెర మోతాదులు ఎక్కువగా ఉంటే తొందరగా మధుమేహం వస్తుంది. ఈ రోజుల్లో ఆహార విషయంలో నియమాలు పాటించకుండా, బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం, సాఫ్ట్ డ్రింక్స్, మద్యపానం, ధూమపానం, ఆర్టిఫిషియల్ షుగర్ వంటివి తీసుకోవడం వల్ల చాలామంది మధుమేహంతో ఇబ్బంది పడుతున్నారు. మధుమేహానికి సరైన చికిత్స అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ.. ఆహార నియమాలు పాటిస్తూ, మందులు వేసుకోవడమే మార్గం. అయితే మధుమేహం సమస్య ఉన్నవారు కొన్ని అనారోగ్య సమస్యలన ఎదుర్కొవలసి వస్తుంది. ఉదాహరణకు షుగర్ ఉన్నవారికి ఏదైనా సమస్య వస్తే అది కాస్త తీవ్రం అవుతుంది. అయితే షుగర్ ఉన్నవారు కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యల బారిన కూడా పడతారట. మరి ఇందులో నిజమెంత? వీటి నుంచి బయట పడటం ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మధుమేహం బారిన పడిన వారు ఎక్కువగా కొన్ని దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడతారు. వీరికి ఏ సమస్య వచ్చిన తగ్గడం చాలా కష్టం. అయితే మధుమేహం ఉన్నవారు ఎక్కువగా మానసిక సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. షుగర్ ఉన్నవారు ఎక్కువగా డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యల బారిన పడుతుంటారు. సాధారణంగా ఎవరైన కూడా వీటి బారిన పడుతుంటారు. కానీ మధుమేహం ఉన్నవారికి ఈ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా ప్రతీ చిన్న సమస్యకు కూడా టెన్షన పడటం వల్ల ఎక్కువగా మానసిక వేదన చెందుతారు. అయితే మధుమేహం బారిన పడిన ప్రతీ ఒక్కరూ కూడా మానసిక సమస్యలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎక్కువ శాతం మందికి ఈ సమస్య ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మిగతా వాళ్లతో పోలిస్తే మధుమేహం వారికి మూడు రెట్లు ఎక్కువగా మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మానసిక వ్యాధులు ఉన్నవారికి కూడా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. వీటితో పాటు గుండె పోటు, పక్షవాతం వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మధుమేహం సమస్య నుంచి విముక్తి చెందాలంటే వ్యాయామం, ఆహారం వంటి వాటిలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీట్లు, బయట ఫుడ్ తినడం వంటివి పూర్తిగా తగ్గించాలి. అలాగే ఏ చిన్న విషయానికి కూడా టెన్షన్‌కు గురికాకుడదు. దీనివల్ల మానసిక సమస్యలు తొందరగా పెరుగుతాయి. ప్రతీ విషయానికి కామ్‌గా ఉండేటట్లు చూసుకోవాలి. దీని నుంచి విముక్తి కోసం రోజూ యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తూండాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.