https://oktelugu.com/

Detox Drinks: ఉదయం పూట ఈ డిటాక్స్ డ్రింక్ తాగితే.. బాడీలో టాక్సిన్స్ క్లియర్

ఉదయం పూట కొన్ని డిటాక్స్ డ్రింక్‌లను తాగితే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మరి ఉదయాన్నే తాగాల్సిన ఆ డిటాక్స్ డ్రింక్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2024 / 06:13 AM IST

    Detox drinks

    Follow us on

    Detox Drinks: రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయాన్నే తీసుకునే ఫుడ్ చాలా ముఖ్యమైనది. ఆరోగ్యమైన ఆహారాలను మాత్రమే పొద్దున్న తినాలి. కొందరు ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. వీటికి బదులు శరీరానికి తక్షణమే శక్తిని ఇచ్చి రోజంతా యాక్టివ్‌గా ఉండేలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. చాలా మంది ఉదయం పూటా ఆరోగ్యానికి హానికరమైన సాఫ్ట్‌ డ్రింక్స్‌ను కూడా తీసుకుంటారు. వీటివల్ల ఆ నిమిషానికి ఆకలి తీరిన కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఉదయం పూట ఆరోగ్యానికి హాని చేసే వాటిని తింటే రోజంతా యాక్టివ్‌గా ఉండలేరు. కాస్త అలసట, చిరాకుగా ఉంటుంది. అదే పోషకాలు ఉండి శరీరానికి శక్తిని ఇచ్చే డిటాక్స్ డ్రింక్‌లను తాగితే శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట కొన్ని డిటాక్స్ డ్రింక్‌లను తాగితే బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. మరి ఉదయాన్నే తాగాల్సిన ఆ డిటాక్స్ డ్రింక్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

     

    సాధారణంగా చాలా మంది ఉదయం పూట లేచిన వెంటనే టీ, కాఫీ తాగుతుంటారు. వీటివల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉండవు. అదే ఉదయం పూట ఈ టీకి బదులు డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా నిమ్మకాయ, దోసకాయ, పుదీనాతో డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. అయితే ఈ నీటిని రాత్రిపూట తయారు చేసుకోవాలి. ఉదయం పూట పరగడుపున తాగితే శరీరానికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రాత్రి నిద్రపోయే ముందు నిమ్మకాయ, దోసకాయ, పుదీనాను చిన్నగా కట్ చేసుకోవాలి. వీటిని ఒక బాటిల్‌లో వేసి కాస్త ఉప్పుు వేసుకోవాలి. ఈ వాటర్‌ను ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలో ఉన్న మురికి అంతా కూడా పోతుంది. ముఖ్యంగా ఉదయం ఇలా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నీరు జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీంతో పొట్ట తొందరగా క్లియర్ అవుతుంది. కొందరు మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ డిటాక్స్ డ్రింక్‌ను తాగితే బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

     

    రోజూ ఉదయం ఈ డిటాక్స్ డ్రింక్‌తో డేను స్టార్ట్ చేస్తే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అలాగే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా ఈ డ్రింక్‌ను తాగడం వల్ల బాడీ హ్రైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులోని దోసకాయ, పుదీనా శరీరాన్ని చల్లగా చేస్తాయి. అలాగే కడుపులోని వేడిని కూడా తగ్గిస్తాయి. నిమ్మకాయలో ఎక్కువగా ఆమ్ల గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ నీరు తాగడం వల్ల కేవలం ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాకుండా చర్మం కూడా మెరుగుపడుతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న కూడా తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా, గ్లోగా కనిపిస్తుంది. కాఫీ, టీ, సాఫ్ట్ డ్రింక్స్‌కి బదులు ఈ డిటాక్స్ వాటర్‌ను డైలీ తాగడం ఆరోగ్యానికి మంచిది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.