Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam: వేదికపై మోనితను అవమానించిన దీప.. శుభవార్త అంటూ సంబరపడిన మోనిత!

Karthika Deepam: వేదికపై మోనితను అవమానించిన దీప.. శుభవార్త అంటూ సంబరపడిన మోనిత!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎంతో ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే అత్యధిక రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ మరింత రసవత్తరంగా కొనసాగుతోంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా డాక్టర్ ప్రెసిడెంట్ మీటింగ్ లో కార్తీక్ తనకు భర్తగా సంతకం చేసినటువంటి ఆధారాలను చూపెడుతూ మాట్లాడుతుంది.ఆ సమయంలోనే అక్కడే ఉన్నటువంటి దీప చప్పట్లు కొట్టగా అందరూ షాక్ అవుతారు. ఇక వేదిక పైకి వెళ్లిన దీప మోనితను పక్కకునెట్టి తను మాట్లాడుతుంది. మోనిత చేసిన పనుల గురించి బయట పెడుతూ తనని అవమాన పరుస్తుంది.

Karthika Deepam
Karthika Deepam

ఇలా దీప అవమానించడంతో అక్కడి నుంచి కోపంగా బయటకు వెళుతుంది. అప్పుడు ప్రియమణి ఎందుకమ్మా ఇదంతా కార్తిక్ అయ్యను వదిలేయండి అంటూ అనడంతో మోనిత ప్రియమణి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక డాక్టర్ భారతి కార్తీక్ మాట్లాడాలి అని చెప్పగా కార్తీక్ దండం పెడుతూ తను మాట్లాడని చెబుతాడు ఇంతటితో ఈ వేడుక అయిపోగా అందరు బయటకు వెళ్తారు. అక్కడే ఉన్న మోనితను మరోసారి వీరితో గొడవ పడటానికి ప్రయత్నిస్తుంది. అప్పటికే ఎంతో కోపంగా ఉన్న కార్తీక్ తనపై మరింత కోపం పెంచుకోగా సౌందర్య వారిని శాంత పరుస్తుంది.

Also Read: ఆధారాలతో కార్తీక్ బాగోతం బయటపెట్టిన మోనిత.. అన్యాయం జరిగిందంటూ ఆవేదన!
ఇలా వీరితో గొడవ పడుతూ ఈ గొడవంతా కూడా తను మీ ఇంట్లో సెటిల్ అవ్వడానికి చేస్తున్నానని మోనిత చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.ఇక ఆ వేడుక నుంచి ఇంటికి సౌందర్య ఆనందరావు రావడంతో ఆదిత్య వారిని చూసి ఎలా జరిగింది అని అడగగా అక్కడికి మోనిత వచ్చిన విషయాన్ని చెబుతారు. దీంతో ఆదిత్య ప్రశ్నల పై ప్రశ్నలు వేస్తారు. ఇక పిల్లలు వచ్చి వారికి స్వీట్ చేయమని చెప్పగా ఆదిత్య వారిని కోప్పడతారు. దీప పిల్లలకు సర్ది చెప్పి వారిని అక్కడి నుంచి తీసుకువెళుతుంది.

మరోవైపు దీప మాట్లాడిన మాటలను తలుచుకుంటూ రగిలిపోతున్న మోనితకి లాయర్ ఫోన్ చేయడంతో అతను చెప్పిన మాటలు విని ప్లాన్ అంతా ఓకే అయిందని మాట్లాడగా మోనిత శుభవార్త అంటూ సంబరపడుతుంది. ఆ సమయంలోనే ప్రియమణి వచ్చి మరోసారి దీపకు సపోర్ట్ గా మాట్లాడటంతో తనని గట్టిగా మందలిస్తుంది. ఇక దీప సౌందర్య మాట్లాడుతూ కూర్చొని ఉంటారు.అప్పుడే నువ్వంటే నాకు చాలా ఇష్టం దీప ఒకవేళ కార్తీ కనుక నిజంగానే అలా చేసి ఉంటే తనతో నీకు విడాకులు ఇప్పించి నాతోపాటు తీసుకెళ్లి కంటికి రెప్పలా కాపాడుకొనేదాన్ని అంటూ సౌందర్య ఎమోషనల్ అయ్యారు. అయితే మోనిత ఏ విధమైనటువంటి పథకం వేసింది ఎందుకు అంత సంతోషంగా ఉంది అనే విషయాలు తరువాత ఎపిసోడ్లో తెలియనుంది.

Also Read: దీపను తప్పించే ప్లాన్ లో ఉన్న మోనిత.. చాటుగా తన ప్లాన్ ఏంటో తెలుసుకున్న ప్రియమణి!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular