Homeలైఫ్ స్టైల్Personal Finance debt free planning tips: ఈ ప్లానింగ్ తో అప్పులు దూరం.. ఆదాయం...

Personal Finance debt free planning tips: ఈ ప్లానింగ్ తో అప్పులు దూరం.. ఆదాయం ఘనం.. వెంటనే తెలుసుకోండి..

Personal Finance debt free planning tips: ప్రస్తుత రోజుల్లో ఆదాయం కంటే ఖర్చులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఒక ఉద్యోగికి ఎంత ఆదాయం వచ్చిందనే దాని కంటే అతడు ఏ విధంగా ఆర్థిక ప్రణాళిక వేసుకున్నాడు? అనేది ఇంపార్టెంట్ గా మారింది. ఉదాహరణఖు ఒక ఉద్యోగికి నెలకు రూ.50,000 జీతం వస్తే, సరైన ప్లానింగ్ లేకపోతే ఎంత సంపాదించినా డబ్బు మిగలదు. కానీ కచ్చితమైన బడ్జెట్ విధానం పాటిస్తే సేవింగ్స్ పెరగడంతో పాటు భవిష్యత్తులో ఆర్థిక భద్రత కూడా పొందవచ్చు. అందుకోసం సాధారణంగా ఫైనాన్షియల్ నిపుణులు సూచించే 50:30:20 రూల్ పాటించడం చాలా అవసరం. ఈ రూల్ ను ఎలా పాటించాలి?

మొదటిగా, 50% అంటే రూ.25,000ను అవసరమైన ఖర్చులకు కేటాయించాలి. ఇందులో ఇంటి అద్దె, కిరాణా, విద్యుత్ బిల్లు, ట్రాన్స్‌పోర్ట్, మెడికల్ వంటి ప్రాథమిక అవసరాలు వస్తాయి. ఈ విభాగంలో ఖర్చులు నియంత్రణలో ఉంటేనే మిగిలిన డబ్బుతో ప్లానింగ్ సులభమవుతుంది.

తర్వాత 30% అంటే రూ.15,000ను వ్యక్తిగత ఖర్చులు లేదా లైఫ్‌స్టైల్ కోసం ఉపయోగించవచ్చు. ఇందులో బయట భోజనం, ఎంటర్టైన్‌మెంట్, షాపింగ్, ట్రావెల్ వంటి అంశాలు ఉంటాయి. ఈ ఖర్చులను పూర్తిగా తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ పరిమితిలో ఉంచడం చాలా ముఖ్యం.

మిగిలిన 20% అంటే కనీసం రూ.10,000ను సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం తప్పనిసరిగా పెట్టాలి. ఇది మీ భవిష్యత్తు కోసం కీలకం. ఈ మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్, Systematic Investment Plan (SIP), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), లేదా Life Insurance Corporation of India వంటి భద్రత కలిగిన పాలసీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

అదనంగా, మొదట 3 నుండి 6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ తయారు చేయడం చాలా ముఖ్యం. ఇది ఆకస్మిక పరిస్థితుల్లో (జాబ్ లాస్, అనారోగ్యం) ఆర్థికంగా నిలబడటానికి సహాయపడుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి రిస్క్ కవర్లు కూడా తప్పనిసరిగా ఉండాలి. రూ.50,000 జీతం వచ్చినా సరైన ప్లానింగ్ ఉంటే సేవింగ్స్ పెంచుకోవచ్చు, అప్పుల నుంచి దూరంగా ఉండవచ్చు, మరియు క్రమంగా సంపదను నిర్మించుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version