Homeలైఫ్ స్టైల్LIC best plans for children: పిల్లల భవిష్యత్ కోసం బెస్ట్ LIC ప్లాన్స్ ఇవే..

LIC best plans for children: పిల్లల భవిష్యత్ కోసం బెస్ట్ LIC ప్లాన్స్ ఇవే..

LIC best plans for children: ప్రస్తుత కాలంలో జనజీనవం ఎలా ఉన్నా.. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు అనేక రకాల పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే వారికి మంచి విద్య, కెరీర్.. ఆ తర్వాత పెళ్లి ఈ మూడు లక్ష్యాల కోసం ఆర్థికంగా ముందుగానే సిద్ధం కావడం ఎంతో అవసరం. ప్రస్తుత కాలంలో విద్య ఖర్చులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సరైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ లేకపోతే భవిష్యత్తులో భారంగా మారే అవకాశం ఉంది. అందుకే భద్రత, నమ్మకానికి ప్రాధాన్యం ఇచ్చే భారతీయులు ఇప్పటికీ Life Insurance Corporation of India (LIC) పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. వీటిలో ఈ మూడు పాలసీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అంటున్నారు. వాటి గురించి వివరాల్లోకి వెళితె..

‘IRR’ (Internal Rate of Return):
Internal Rate of Return అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్ మీద మీరు సంవత్సరానికి పొందే వాస్తవ రాబడి శాతం. అంటే మీరు ప్రతి సంవత్సరం కట్టే ప్రీమియం, చివర్లో వచ్చే మ్యాచ్యూరిటీ అమౌంట్, మధ్యలో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కలిపి మీ డబ్బు ఎంత శాతం పెరిగిందో చూపించే సూచిక ఇది. సింపుల్‌గా చెప్పాలంటే మీ డబ్బు నిజంగా ఎంత పని చేసింది? అనేది IRR చెబుతుంది. ఈ పాలసీని ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తారు. పాలసీ పూర్తయ్యే సమయానికి (maturity) ఒక పెద్ద మొత్తం వస్తుంది. కొన్ని ప్లాన్లలో మధ్యలో మనీ బ్యాక్ కూడా ఉంటుంది. ఈ మొత్తం క్యాష్ ఫ్లోలన్నింటినీ తీసుకుని లెక్కిస్తే వచ్చే రాబడి శాతమే IRR. ఇది సాధారణంగా LIC సంప్రదాయ పాలసీల్లో 4% నుంచి 6% మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది.

LIC Jeevan Lakshya:
పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన ఒక పాపులర్ పాలసీ. పాలసీ హోల్డర్ (తల్లిదండ్రులు) అకస్మాత్తుగా లేకపోతే.. మిగిలిన ప్రీమియంలను LIC భరిస్తుంది. అలాగే పిల్లల విద్య లేదా ఇతర అవసరాలకు ముందుగా నిర్దిష్ట మొత్తాలను చెల్లిస్తుంది. మ్యాచ్యూరిటీ సమయంలో ఒక పెద్ద మొత్తాన్ని అందిస్తుంది. అయితే IRR పరంగా చూస్తే ఇది సాధారణంగా 5 నుంచి 6 శాతం మధ్యలో ఉండే అవకాశముంది. అంటే భద్రత ఉన్నా… రాబడి మాత్రం మోస్తరు స్థాయిలో ఉంటుంది.

LIC Jeevan Tarun:
ఈ ప్లాన్ ప్రత్యేకంగా పిల్లల విద్య కోసం రూపొందించబడింది. ఇందులో పిల్లవాడి వయస్సు ఆధారంగా 20, 22, 24 సంవత్సరాల వయస్సులో పార్ట్ పేమెంట్స్ అందుతాయి. చివర్లో మ్యాచ్యూరిటీ అమౌంట్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉండడం వల్ల కొంతమందికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే IRR ఇక్కడ కూడా సాధారణంగా 4.5 నుంచి 5.5 శాతం మధ్యలోనే ఉంటుంది.

మరోవైపు LIC Children Money Back Plan పిల్లల ఎదుగుదల దశల్లో డబ్బు అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఇది మనీ బ్యాక్ పాలసీ కాబట్టి మధ్య మధ్యలో కొంత మొత్తాన్ని తిరిగి ఇస్తుంది. అయితే ఈ తరహా ప్లాన్లలో రాబడి మరింత తగ్గి సుమారు 4 నుంచి 5శాతం మధ్యలో ఉండే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్‌గా కాకుండా, సేవింగ్ + సెక్యూరిటీగా చూడాలి.

మొత్తానికి, LIC ప్లాన్లు భద్రత, గ్యారంటీ పరంగా బలంగా ఉన్నప్పటికీ, అధిక రాబడులు ఆశించే వారికి ఇవి సరిపోవచ్చు అనడం కష్టం. కాబట్టి పాలసీ తీసుకునే ముందు IRR లెక్కలు చూసి మీ లక్ష్యాలు,పిల్లల విద్య, రిస్క్ కవర్, లిక్విడిటీ వాటికి ఏ ప్లాన్ బెటర్‌గా సరిపోతుందో నిర్ణయించుకోవడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version