David Warner: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. మన దగ్గర విరాట్ కోహ్లీ ఎంత తోపో.. ఇతడు కూడా బ్యాటింగ్ లో అంతటి తోపు. మంచినీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు కొడతాడు.. జెర్సీ వేసినంత ఈజీగా సిక్సర్లు బాదుతాడు. కానీ కొన్ని సంవత్సరాలుగా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడలేక పోతున్నాడు. అచ్చం భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ మాదిరే ఫామ్ కోల్పోయి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఆసియా కప్ టోర్నీలో సుదీర్ఘ బ్రేక్ కు విరాట్ కోహ్లీ స్వస్తి పలికినట్టు.. వార్నర్ కూడా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో సెంచరీ బాది తనపై ఉన్న భారాన్ని ఒక్కసారిగా దించుకున్నాడు.. ఎప్పుడో 2020 జనవరిలో టీం ఇండియా పై అంతర్జాతీయ సెంచరీ చేశాడు. రెండున్నర సంవత్సరాలుగా సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు.. అయినప్పటికీ పరుగులు చేస్తూనే ఉన్నాడు..

మూడో వన్డేలో సెంచరీ
స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో డేవిడ్ వార్నర్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ వన్ జీరో టు జీరో రోజుల గ్యాప్ తీసుకుని అంతర్జాతీయ సెంచరీ సాధిస్తే… డేవిడ్ వార్నర్ 1040 రోజుల తర్వాత శతకాన్ని నమోదు చేశాడు.. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కురవడంతో మ్యాచ్ ను 28 ఓవర్లకు కుదించారు. తొలత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 48 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 355 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ ట్రావిస్ హెడ్ అద్భుతమైన భాగస్వామ్యం వల్ల తొలి వికెట్ కు 269 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 102 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో వార్నర్ 106 పరుగులు చేశాడు.. తన కెరియర్లో 44వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు.. ప్రస్తుత తరంలో అత్యధిక సెంచరీలు బాదిన రెండో బ్యాటర్ గా జో రూట్ రికార్డు సమం చేశాడు. సెంచరీ తర్వాత డేవిడ్ వార్నర్ స్టొరీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. పెవిలియన్ కు చేరే క్రమంలో తన గ్లౌవ్స్ పిల్లాడికి బహుకరించాడు.
దానికోసమే సెంచరీ చేశాడా
క్రికెట్ ఆస్ట్రేలియాలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.. జట్టు ప్రయోజనాల కోసం అక్కడి క్రికెట్ సమాఖ్య ఎంతటి నిర్ణయాలకైనా వెనకాడదు. గ్రేమ్ స్మిత్ లాంటి ఆటగాడినే పక్కన పెట్టిందంటే క్రికెట్ ఆస్ట్రేలియా ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. అయితే డేవిడ్ వార్నర్ గత కొంతకాలంగా సెంచరీలు చేయడం లేదు.. ప్రస్తుతం 36వ వడిలో ఉన్నాడు. ఇప్పటివరకు 96 టెస్టులు, 138 వన్డేలు, 95 టి20 లు ఆడాడు. 2018లో బాల్ టాంపరింగ్ పాల్పడినందుకు ఒక సంవత్సరం నిషేధం ఎదుర్కొన్నాడు. 2009లో టి20 మ్యాచ్ ల్లో ఆరంగేట్రం చేశాడు.

అదే సంవత్సరం అతడు మొదటిసారి వన్డే ఆడాడు.. ఆ తర్వాత రెండు సంవత్సరాలకి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆల్ ఫార్మాట్ ఆటగాళ్లలో ఒకడు అయ్యాడు.. తన బ్యాటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు నిరంతరం ప్రయత్నించే క్రికెటర్… ఫిట్ నెస్ కు అత్యంత ప్రాధాన్యం ఇస్తాడు. అయితే ఇంగ్లాండ్ తో సెంచరీ చేసిన అనంతరం.. విలేకరులతో మాట్లాడాడు.. 2024 ప్రపంచ కప్ కోసం 20 20 అంతర్జాతీయ మ్యాచులు ఆడాలని యోచిస్తున్నట్టు చెప్పాడు. అయితే డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ కోసమే సెంచరీ చేశాడని మాజీ క్రికెటర్లు చర్చించుకుంటున్నారు. దీంట్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు గానీ.. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో మాత్రం పాత డేవిడ్ వార్నర్ కనిపించాడు. 36వ వడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రపంచ కప్ లో ఆడి రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.