https://oktelugu.com/

Curry Leaves: ఖాళీ కడుపుతో ఈ ఆకును 15 రోజులు తింటే చాలు.. సమస్యలన్నీ మటుమాయం

కరివేపాకును ఉదయం పూట నమిలితే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. కేవలం 15 రోజుల పాటు ఉదయం పరగడుపున కరివేపాకును నమిలితే బాడీలో వచ్చే మార్పులు మీరే గమనిస్తారు. మరి డైలీ వీటిని నమలడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలేంటో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 2, 2024 8:25 pm
    Curry leaves

    Curry leaves

    Follow us on

    Curry Leaves: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి పోషకాలు తప్పకుండా ఉండాలి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కొందరు కొన్ని చిట్కాలను పాటిస్తుంటారు. ముఖ్యంగా ఆహార విషయంలో ఈ నియమాలు పాటిస్తారు. వీటివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని అంటుంటారు. అయితే ఈ రోజుల్లో మారిన అలవాట్ల వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి వాటికి కారణం అవుతున్నారు.

     

    ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పకుండా కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ముఖ్యంగా ఉదయం పూట తప్పకుండా ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలి. కొందరు ఉదయం పూట డిటాక్స్ డ్రింక్, తులసి, వేపాకు వంటి ఆకులను నములుతుంటారు. అయితే ఇలానే కరివేపాకును ఉదయం పూట నమిలితే ఆరోగ్యానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. కేవలం 15 రోజుల పాటు ఉదయం పరగడుపున కరివేపాకును నమిలితే బాడీలో వచ్చే మార్పులు మీరే గమనిస్తారు. మరి డైలీ వీటిని నమలడం వల్ల కలిగే ఆ ప్రయోజనాలేంటో చూద్దాం.

    కరివేపాకును కూరల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇవి కూరకి రుచిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. రోజూ ఖాళీ కడుపుతో ఉదయం పూట ఈ ఆకులను నమిలితే బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కొందరు జీర్ణ సమస్యలు, మలబద్ధకం వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు డైలీ కరివేపాకు తింటే సమస్య ఈజీగా తగ్గిపోతుంది.

     

    ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మొటిమలు, మచ్చలు లేకుండా సాయపడుతుంది. ఇందులోని విటమిన్లు, మినరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకులు తినడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో కేవలం 15 రోజుల పాటు నమలితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి బాగా ఉపయోగపడతాయి.

     

    కరివేపాకులను డైరెక్ట్‌గా తినలేని వారు కూరల్లో అయిన వాడవచ్చు. శరీరంలో ఉండే విషాన్ని తొలగించడంలో కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు వల్ల జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. డైలీ ఆ ఆకుల వల్ల తినే ఫుడ్ కూడా ఈజీగా జీర్ణం అవుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు తినడం వల్ల మాత్రమే కాకుండా జుట్టుకు పేస్ట్‌ను అప్లై చేస్తే బలంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గుతుంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.