Homeబిజినెస్Credit Card: డబ్బులు క్రెడిట్ కార్డులకు కాస్తున్నాయి.. ఇలాగే ఉంటే చైనా, అమెరికాను దాటిపోవడం ఖాయం

Credit Card: డబ్బులు క్రెడిట్ కార్డులకు కాస్తున్నాయి.. ఇలాగే ఉంటే చైనా, అమెరికాను దాటిపోవడం ఖాయం

Credit Card: మార్కెట్లో ఖరీదైన వస్తువు కనిపించింది. మనసులో కొనాలని కోరిక పుట్టింది. జేబులో చూస్తే డబ్బులు లేవు. డెబిట్ కార్డులో అంతంత మాత్రమే నిల్వలు ఉన్నాయి. దీంతో మనసులో కోరికను చంపుకొని, ఆర్థిక పరిస్థితిని తిట్టుకుంటూ ఇంటికి నిరాశగా వెళ్లిపోయిన దుస్థితి.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చేసేది చిన్న ఉద్యోగమైనప్పటికీ బ్యాంకులు ఉదారంగా క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. ముందు కొనుగోలు చేయండి, తర్వాత చెల్లించేయండి అనే పాలసీని అమలు చేస్తున్నాయి. అంతేకాదు ఇలా ఉదారంగా క్రెడిట్ కార్డులు ఇవ్వడం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తిని పెరుగుతుందని బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. గతంలో ఇలాంటి విధానాన్ని అమెరికా, చైనా దేశాలు అమలు చేశాయి. అయితే ప్రస్తుతం ఆ రెండు దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడటం, వడ్డీ రేట్లు పెరగడంతో బ్యాంకులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.. అయితే ఆ రెండు దేశాలతో పోల్చితే జనాభా సంఖ్యలో భారత్ అగ్రగామి.. ఈ నేపథ్యంలో ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచేందుకు బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి. ఇది చైనా, అమెరికా దేశాలను మించి పోవడం విశేషం.

ఇక తాజా గణాంకాల ప్రకారం దేశంలో క్రెడిట్ కార్డు లావాదేవీలు శరవేగంగా పెరిగాయి. భారత రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కార్డుల ద్వారా మొత్తం 25 కోట్ల లావాదేవీలు జరిగాయి. అందులో 22 కోట్లు క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ ల ద్వారానే జరగడం విశేషం. ఇక విలువపరంగా చూస్తే క్రెడిట్ కార్డుల ద్వారా 1.3 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. డెబిట్ కార్డు లావాదేవీల విలువ 53 వేల కోట్లుగా నమోదయింది. కోవిడ్ తర్వాత ఈ స్థాయి వృద్ధిని అంచనా వేయలేదని రిజర్వ్ బ్యాంక్ వర్గాలే చెబుతున్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లో ధరల స్థాయి పెరుగుతున్నప్పటికీ ప్రజల కొనుగోలు శక్తి మాత్రం తగ్గలేదని రిజర్వ్ బ్యాంకు చెబుతోంది. పైగా వస్తువుల కొనుగోలుకు సంబంధించి ప్రజలు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదని తెలుస్తోంది. వ్యక్తిగత వాహనాల నుంచి మొదలుపెడితే గృహాల వరకు ప్రజలు కొనుగోలు చేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

వ్యక్తిగత ఆదాయం లో అనూహ్య మార్పు రావడం వల్లే ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు. బ్యాంకులు కూడా సరళీకృత విధానాలు అమలు చేయడంతో ప్రజలకు ఒకప్పుడు ఉన్న ఇబ్బందులు ఇప్పుడు లేవు. దీనివల్ల మార్కెట్లో హెచ్చుతగ్గులు అనేవి లేకుండా పోయాయి.. గడచిన ఏడాది కాలంలో క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు 20 శాతం పెరిగాయి. డెబిట్ కార్డు ట్రాన్జక్షన్లు 31 శాతం తగ్గాయి. డిజిటల్ చెల్లింపుల కోసం అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు గణనీయంగా తగ్గుతూ వచ్చాయి. అయితే, క్రెడిట్ కార్డు వినియోగం మాత్రం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుండడం విశేషం. గత నెలలో యూపీఐ లావాదేవీలు 536 కోట్లకు పెరిగాయి. ఇక గత ఎడాది ఇదే నెలలో 254 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం దేశంలో 8.5 కోట్ల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏడాది క్రితం ఈ సంఖ్య 7.5 కోట్లుగా ఉంది. ఇక మూడేళ్ల క్రితం వినియోగంలో ఉన్న క్రెడిట్ కార్డులు ఐదు కోట్ల లోపే ఉండడం విశేషం. కోవిడ్ తర్వాత మనిషి ఆలోచనలో మార్పు వచ్చింది. జీవితం క్షణభంగురం అని తెలిసి.. ఉన్నప్పుడే అన్నీ అనుభవించాలనే కోరిక మొదలైంది. ఇందులో భాగంగానే ఖర్చుకు వెనుకాడటం లేదు. అప్పు చేసేందుకు కూడా భయపడటం లేదు. స్వల్ప వేతన శ్రేణి ఉన్నప్పటికీ వెనుకంజ వేయడం లేదు. అయితే గతంలో ఇలాంటి పరిస్థితి చైనా, అమెరికా దేశాల్లో ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి ఇండియాలో నెలకొంది. అయితే దేశంలో జనాభా పెరగడం, ఆర్థిక అక్షరాస్యత మీద అవగాహన రావడంతో ప్రజలు కార్డుల వినియోగాన్ని పెంచారు. డిజిటల్ పేమెంట్లు మార్కెట్ రంగాన్ని ఊపేస్తున్నప్పటికీ క్రెడిట్ కార్డుల వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. ఫ్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular