Corona: కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రజలను పీడిస్తూనే ఉంది. ఏదో ఓ రూపంలో తన ప్రభావం చూపిస్తూనే ఉంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చైనాలో పుట్టిన వైరస్ ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తోంది. దీంతో అన్ని వ్యవస్థలు కష్టాలు ఎదుర్కొన్నాయి. కరోనా ప్రభావంతో ప్రజలు నిరంతరం ఆందోళన చెందుతూనే ఉన్నారు. ఈ నేపత్యంలో వైరస్ ను తుదముట్టించే క్రమంలో టీకాలు వచ్చినా దాని విస్తరణ మాత్రం ఆగడం లేదు.

దీంతో పదేళ్లపాటు కరోనా ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఏదో ఒక రూపంలో కరోనా ప్రజలతో సహవాసం చేస్తుందని చెబుతున్నారు. దీంతో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా కరోనా వైరస్ తన ప్రభావం చూపింది. చూపుతోంది కూడా. రాబోయే కాలంలో కూడా దాని విస్తరణ ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తోంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. కరోనాతో అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.

కరోనా వైరస్ పై పలు వాదనలు వస్తున్నా దాని పుట్టుకపై మాత్రం చైనా తప్పించుకుంటోంది. దాని మూలాలు మాత్రం అక్కడే ఉన్నట్లు పలు ఆధారాలు ఉన్నా తమ ప్రమేయం లేదని బుకాయిస్తోంది. దీంతో వైరస్ తోనే సహజీవనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. వైరస్ నిర్మూలనకు టీకాలు వచ్చినా అందరు తీసుకోవడం లేదు. ఫలితంగా ఇంకా దాని ప్రభావం అలాగే ఉంటోందనేది తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ పై రాజద్రోహం కేసు పెట్టేందుకు బీజేపీ రెడీ
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో ప్రగతిపథంలో సాగడం లేదు.చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ నెమ్మదిగానే సాగుతోంది. దీంతోనే వైరస్ ముప్పు ఇంకా తొలగడం లేదు. ఏదో ఒక వేరియంట్ల రూపంలో నిత్యం ప్రజలను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. మొత్తానికి కరోనా ముప్పు తొలగిపోయేందుకు ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. దీనికి అందరు సిద్ధంగానే ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి మానవుల శరీరాల్లో దాగి ఉండే ఓ వైరస్ గానే గుర్తింపు పొందింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందే. నిబంధనలు పాటించాల్సిందే. మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండటానికే ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం ఏర్పడింది.
Also Read: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపెవరిది?