https://oktelugu.com/

Cooking: ఆ పాత్రల్లో వండుతున్నారా? అయితే డేంజర్ జోన్ లో ఉన్నట్టే..

కొన్ని పాత్రల లోహాలు ఆహారంలోకి చేరి వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని వారి అధ్యయనంలో తేలింది. వంటసమానులో క్యాడ్మియం, నికోల్, క్రోమియం, కాపర్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయట.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 20, 2023 5:10 pm
    Cooking-in-these-5-metal-ut
    Follow us on

    Cooking: ఆరోగ్యంగా ఉండాలని ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొన్ని సార్లు ఎంత ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకున్నా కూడా మనం తెలియక చేసే చిన్న చిన్న తప్పులే ఆరోగ్యాన్ని ఎక్కువగా దెబ్బతీస్తాయి. వంట రుచిగా ఉండాలి అని చూస్తాం.. కానీ ఎందులో వండుతున్నాం అనేది అసలు ఆలోచించం. అయితే తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకమైన జబ్బుల బారిన పడడం ఖాయం అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ లోని కాలేజ్ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ కు చెందిన ప్రొఫెసర్లు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం..

    కొన్ని పాత్రల లోహాలు ఆహారంలోకి చేరి వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయని వారి అధ్యయనంలో తేలింది. వంటసమానులో క్యాడ్మియం, నికోల్, క్రోమియం, కాపర్ ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలపై ప్రభావం చూపిస్తాయట. కేన్సర్, పక్షవాతం, పొట్టలో ఇబ్బంది, గుండె జబ్బుల వల్ల ప్రమాదం తప్పదంటున్నారు. అలాగే పిల్లల్లో కాపర్ లెవల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మానసిక రుగ్మతలు వచ్చే రిస్క్ ఎక్కువ తెలిపారు. అందుకే ఇంట్లో వంట చేయడానికి, వడ్డించడానికి, నిల్వ చేయడానికి వాడే వంటసామాను విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

    యానోడైజ్డ్ అల్యూమినియం..
    యానోడైజ్డ్ అల్యూమినియం వంటసామాను చాలా స్ట్రాంగ్ , టఫ్ గా ఉంటుంది. ఈ స్క్రాచ్-రెస్టారెంట్ కుక్ వేర్ శుభ్రం చేయడం కూడా ఈజీ. అంతేకాదు ఇందులో వండిన వంటలు అల్యూమినియం వంటసామాను లాగా తుప్పు పట్టవు. ఆ లోహం ఆహారంలో కలవదు. నార్మల్ అల్యూమినియం వంటసామాను కంటే యానోడైజ్డ్ అల్యూమినియం వంటసామాను బెస్ట్ ఆప్షన్ అన్నారు సుఖ్ దీప్ కౌర్.

    అల్యూమినియం..
    అల్యూమినియం వంటసామాను చాలా మంది వాడుతుంటారు. కాని ఇవి కూడా చాలా డేంజర్ అని తెలుస్తోంది. వీటిని వాడితే అల్యూమినియం లోహం ఆహారంలోకి చేరుతుందట. ముఖ్యంగా ఆహారాన్ని ఎక్కువ సేపు ఉడికించినప్పుడు లేదా టమోటోలు, సిట్రస్ పండ్లు వంటి ఎసిడిక్ ఫుడ్స్ వండినప్పుడు ఈ మెటలో ఆహారంలోకి చాలా పెద్ద మొత్తంలో కలిసిపోతుందని తెలిపారు.

    కాస్ట్ ఐరన్..
    కాస్ట్ ఐరన్ వంటసామాను మన్నికైనది. వేడిని బాగా నిలుపుకుంటుంది. కానీ ఇది చాలా ఎక్కువ ఇనుమును ఆహారంలోకి విడుదల చేస్తుంది. దాని వల్ల వాటిలో వండిన ఫుడ్ విషపూరితంగా తయారవుతుంది. కాస్ట్ ఐరన్ తో తయారైన కిచెన్ ఐటమ్ ను వాడే వారు సరిగ్గా వాడాల్సి ఉంటుంది. అది తుప్ప పట్టకుండా ఉండేందుకు ఉప్పు లేని నూనునున అప్టై చేయాలి.

    స్టెయిన్ లెస్ స్టీల్
    స్టెయిన్ లెస్ స్టీల్ వంట సామానులో అధిక స్థాయిలో ఐరన్, నికెల్, క్రోమియం ఉండవచ్చు. ఇది కొంత మందికి అలెర్జీని కలిగిస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలలో విషపూరిత మూలకాలు పెరగకుండా తేలికపాటి డిటర్జెంట్ లతో కడగాలిన ప్రొఫెసర్లు సూచించారు.

    టెఫ్లాన్ పూతలతో కూడిన నాన్ – స్టిక్ వంటసామాను గోకడం లేదా వేడెక్కడం వల్ల విషపూరిత వాయువులు, లోహాలు విడుదలవుతాయని హెచ్చిరించారు. రాగి వంటసమానులో విషపూరిత మూలకాలు ఉన్నాయని కూడా వెల్లడించారు. ఇక మైక్రోవేవ్ ల కోసం చౌకైన ప్లాస్టిక్ ను వాడవద్దన్నారు.