Contact Lenses: ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ జీవికి కళ్లు అనేవి చాలా ముఖ్యమైనవి. కళ్లు లేకపోతే అందమైన ప్రపంచాన్ని అసలు చూడలేరు. అయితే ఈ రోజుల్లో చాలా మంది గంటల తరబడి మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ వంటివి చూసి కళ్లను పాడు చేసుకుంటున్నారు. దీంతో కొందరు కళ్లజోడులు వాడుతున్నారు. అయితే వీటిని పెట్టుకుంటే అందంగా కనిపించమన, లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల కళ్లజోడుకి బదులు కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నారు. వీటిని వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కళ్లపై ప్రభావం పడుతుంది. మిగతా సీజన్లతో పోలిస్తే శీతాకాలంలో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే కళ్ల ప్రమాదంలో పడతాయి. సాధారణంగానే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే కళ్లకు మంటలు వస్తాయి. అలాంటిది శీతాకాలంలో పెట్టుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరి చూద్దాం.
హైడ్రేట్‌గా ఉండాలి
కళ్లు పొడి బారకుండా చూసుకోవాలి. అంటే ఈ కాలంలో ఎక్కువగా వాటర్ తాగుతుండాలి. దీనివల్ల మీరు హైడ్రేట్‌గా ఉంటారు. దీంతో కళ్లు కూడా పొడిబారవు. అలాగే కళ్లకు ఎక్కువగా హాని జరగకుండా చూసుకోవాలి. అవసరమైతే లూబ్రికేటింగ్ వంటి కంటి చుక్కలను కూడా ఉపయోగించవచ్చు.
ఎక్కువ సమయం ధరించకూడదు
కొందరు ఈ కాంటాక్ట్ లెన్స్‌ను ఎక్కువగా ధరిస్తుంటారు. ఏదైనా లిమిట్‌లో ధరిస్తేనే మంచిది. కానీ కొందరు రోజంతా కూడా వీటిని ధరిస్తారు. వీటివల్ల కళ్లు దెబ్బతింటాయి. అలాగే ఈ కాంటాక్ట్ లెన్స్‌ను కనీసం ఆరు లేదా ఏడాదికి మారుస్తుండాలి. మళ్లీ కొత్తవి వాడాలి. అంతే కానీ పాతవే అలా వాడితే కళ్లు దెబ్బతింటాయి. వీటిని కొంత సమయం ధరించి ఆ తర్వాత కళ్లజోడు వాడితే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాంటాక్ట్ లెన్స్ మెటీరియల్ రకం లేదా సిలికాన్ హైడ్రోజెల్ లెన్స్‌లను ఎంచుకోవడం మంచిది. ఇవి కంటి నుంచి నీరు రాకుండా ఉండటంలో ఉపయోగపడతాయి.
శుభ్రం చేయాలి
కొందరు కాంటాక్ట్ లెన్స్‌ను అసలు శుభ్రం చేయరు. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. అయితే సాధారణ వాటర్‌తో వీటిని శుభ్రం చేయకూడదు. వీటిని శుభ్రం చేసే వాటర్ ఉంటుంది. దాంతో మాత్రమే క్లీన్ చేయాలి. అలాగే కళ్లకు కూడా ఎలాంటి రసాయనాలు హాని కలిగించకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఎక్కువగా స్క్రీన్ చూడకూడదు
కాంటాక్ట్ లెన్స్ వాడుతున్న వారు ఎక్కువగా టీవీ, మొబైల్ వంటివి చూడకూడదని నిపుణులు చెబుతున్నారు. రోజులో కొంత సమయం మాత్రమే చూడటానికి సమయం పెట్టుకోవాలి. అలాగే పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే క్యారెట్, కీరదోస, ఆకు కూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటివల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వీటితో పాటు డ్రైఫ్రూట్స్ వంటివి కూడా అధికంగా తీసుకోవాలి. వీటిని తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.