Depression: ప్రతిరోజూ ఆహారంతో పాటు ఇవి తింటే డిప్రెషన్ మటుమాయం..

ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజీలో ఉండి ఆహారం గురించి పెద్దగా పట్టించుకోరు. దీంతో చాలా చిన్న వయసు వారికే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Written By: Srinivas, Updated On : August 2, 2023 2:48 pm

Depression

Follow us on

Depression: దైనందిన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతూ ఉంటారు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఏదో ఒక విషయంలో స్ట్రెస్ కు ఫీల్ కావడంతో ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. తాము డిప్రెషన్ కు గురవుతున్నామనే విషయం ఎవరికి వారు తెలుసుకోరు. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. రోజువారీ వ్యాయామంతో పాటు వాకింగ్ లేకపోవడం డిప్రెషన్ కు కారణమవుతోంది. అయితే ఇవి చేస్తూనే మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని ప్రత్యేక పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. అంతే కాకుండా ఎక్కువగా డిప్రెషన్ ఉన్నవాళ్లు ఇవి తింటే వెంటనే మటుమాయం అవుతాయి.

ప్రతి ఒక్కరూ ఏదో ఒక బిజీలో ఉండి ఆహారం గురించి పెద్దగా పట్టించుకోరు. దీంతో చాలా చిన్న వయసు వారికే పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి. ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగని ప్రతీ విషయానికి మెడిసిన్ వాడడం మంచిది కాదు. మనం రోజూ తీసుకునే ఆహారంతో పాటు మరికొన్ని పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లమవుతాం. వీటిలో డ్రైప్రూట్స్ ఎంతో మేలు చేస్తాయి. డ్రైప్రూట్స్ లల్లోని బాదంను నానబెట్టి ఉదయం తీసుకోవడం ద్వారా ఆరోజంతా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు. అలాగే కాజు కూడా ఒకటి లేదా రెండు నోట్లోవేసుకోవడం మంచిదని అంటున్నారు. వీటితో పాటు నల్ల ద్రాక్ష కూడా ఎంతో మేలు చేస్తుంది.

ప్రత్యేకంగా డ్రై ప్రూట్స్ తినడం ఇష్టం లేని వాళ్లు కర్రీ మెనూల్లోనూ పోషకాలు ఉన్న వాటిని చేర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. వీటిలో బాయిల్డ్ ఎగ్ ప్రధానమైనది. ఉడకబెట్టిన కొడుగుడ్డు తినడం వల్ల డిప్రెషన్ నుంచి రిలీఫ అవుతారు. ఇక పాలకూర కర్రీ కూడా ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని రక్త ప్రసరణను వేగవంతం చేయడానికి పాలకూర సహకరిస్తుంది. రక్త ప్రసరణ జరగడం ద్వారా డిప్రెషన్ మటుమాయం అవుతుంది. టమాటాలు డిప్రెషన్ నుంచి దూరం చేస్తాయి.

అయితే ఈ పదార్థాలు తీసుకోవడంతోనే డిప్రెషన్ పూర్తిగా తగ్గుతుందని కాదు. రోజూవారి వాకింగ్ లేదా వ్యాయామం చేయడంతో పాటు ఇవి తీసుకోవడం వల్ల మీ శరీరం రక్తప్రసరణ సక్రమంగా సాగుతుంది. రక్తప్రసరణ లో ఎటువంటి ఆటంకాలు లేకపోవడంతో వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ. దీంతో డిప్రెషన్ కూడా తగ్గుతుంది. అందువల్ల రోజూ తీసుకునే ఆహారంతో వ్యాయమం చేస్తూనే శక్తినిచ్చే పదార్థాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి..