Constipation: ఉదయాన్నే ఈ వాటర్ తాగితే.. దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యలన్నీంటికి విముక్తి

ఉదయం పూట జీలకర్ర వాటర్‌ను తాగితే మలబద్ధకం సమస్య ఈజీగా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ జీలకర్ర వాటర్‌ను ఎలా తీసుకుంటే మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : November 1, 2024 8:58 pm

Constipation

Follow us on

Constipation: వాతావరణంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు వల్ల కొందరు అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం కాకుండా బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. దీనివల్ల ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్య నుంచి తప్పించు కోవాలంటే తప్పకుండా ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలి. లేకపోతే ఈ సమస్య తీవ్రం అవుతుంది. ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోకపోతే జీర్ణ క్రియ కూడా దెబ్బతింటుంది. దీంతో కడుపు సంబంధిత సమస్యలు అన్ని కూడా వస్తాయి. ఏ ఫుడ్ సరిగ్గా తీసుకోలేరు. ఒకవేళ తీసుకున్న జీర్ణం కాక ఇబ్బంది పడుతుంటారు. మలబద్ధకాన్ని తగ్గించుకోకపోతే అది చివరకు ఫైల్స్, ఫిస్టులాకి దారితీస్తుంది. ఈ సమస్యకు వెంటనే చికిత్స తీసుకోకపోతే కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే రోజూ ఉదయం పూట జీలకర్ర వాటర్‌ను తాగితే మలబద్ధకం సమస్య ఈజీగా తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ జీలకర్ర వాటర్‌ను ఎలా తీసుకుంటే మంచిదో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

మలబద్ధకం అనేది బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు, శరీరానికి తగినంత వాటర్ తాగనప్పుడు, ఫైబర్ తీసుకోకపోవడం వల్ల వస్తుంది. పోషకాలు లేని ఆహారం వల్ల పేగు, జీర్ణ క్రియ దెబ్బతిన్న కూడా మలబద్ధకం వస్తుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే రోజూ ఉదయం పరగడుపున జీలకర్ర వాటర్ తాగడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ జీలకర్ర వాటర్ తాగడం వల్ల కడుపు శుభ్రంగా క్లియర్ అవుతుంది. జీర్ణ క్రియ, పేగు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అయితే జీలకర్ర వల్ల కేవలం మలబద్ధకం సమస్య మాత్రమే తగ్గకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఉంటారు. ముఖ్యంగా ఈ వాటర్‌ను డైలీ తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. ఇందులోని పోషకాలు అనేక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి కూడా జీలకర్ర వాటర్ బాగా ఉపయోగపడుతుంది.

 

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి కూడా జీలకర్ర వాటర్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ వాటర్‌ను ఉదయం తాగాలంటే.. రాత్రిపూట నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు నీటిలో జీలకర్ర వేసి వదిలేయాలి. ఉదయాన్నే ఆ నీటిని కొంచెం వేడి చేయాలి. జీలకర్ర వద్దు అనుకుంటే ఆ వాటర్‌ను వడబోయాలి. లేదంటే జీలకర్రతో ఆ వాటర్ తాగేయచ్చు. ఇలా డైలీ పరగడుపున తాగడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా మాయమైపోతాయి. ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా జీలకర్ర వాటర్ బాగా ఉపయోగపడుతుంది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.