Constipation: గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల కొందరు మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. కదలకుండా ఒకే ప్రదేశంలో ఎక్కువసేపు కూర్చోవడం, నీరు ఎక్కువగా తాగకపోవడం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య బారిన పడిన వారు కూర్చోలేకపోవడం, మల విసర్జనలో నొప్పి, రక్తం రావడం, బాత్రూమ్‌లో గంటల తరబడి కూర్చోవడం, గట్టిగా మలంగా రావడం వంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. వీటిలో ఏ లక్షణం కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. తినే ఫుడ్ కూడా సరిగ్గా జీర్ణం కాక కడుపు నొప్పి రావడం, బాత్రూమ్ వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ రాకుండా ఆగిపోవడం వంటివన్నీ మలబద్ధకం లక్షణాలే. దీనికి మందులు వాడటంతో పాటు ఆహారంలో ఫైబర్ చేర్చడం, నీరు, కొబ్బరి నీరు ఎక్కువగా తాగడం వంటివి చేస్తే తగ్గుతుంది. వీటితో పాటు కొన్ని చిట్కాలు పాటిస్తేనే సమస్య తగ్గుతుంది. మరి పాటించాల్సిన ఆ చిట్కాలేంటో చూద్దాం.
మలబద్ధకం తగ్గాలంటే తప్పకుండా డైట్‌లో ఫైబర్ చేర్చుకోవాలి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడంతో పాటు జొన్నలు, రాగులు, ఓట్స్ వంటివి అధికంగా తీసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్షను రాత్రి పూట నానబెట్టి ఉదయాన్నే వాటిని పాలలో మరిగించి తాగాలి. అలాగే జీలకర్ర వాటర్‌ను ఉదయం పూట తాగడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. కొందరికి బాడీ వేడి చేయడం వల్ల మలబద్ధకం వస్తుంది. బాడీని చలవ చేయడానికి మజ్జిగ, కొబ్బరి నీరు, సబ్జా గింజలు తాగాలి. డైలీ వీటిని తాగడం మల విసర్జన ఫ్రీగా అవుతుంది. అలాగే జీలకర్ర, మెంతులను కాస్త వేయించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ను గోరువెచ్చని నీటిలో వేసుకుని ఉదయాన్నే తాగితే మలబద్దకం సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు త్రిఫల చూర్ణాన్ని కూడా రాత్రి పడుకునే ముందు తాగితే మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ పౌడర్ మలబద్ధకానికి బాగా ఉపయోగపడుతుంది.
మలబద్ధకం తగ్గాలంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకుకూరలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తొందరగా తీరుతుంది. వీటితో పాటు బయట ఫుడ్, చికెన్, మైదా వంటివి తక్కువ తీసుకోవడంతో పాటు నీరు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు రాత్రి సరైన సమయానికి నిద్రపోవాలి. ధూమపానం, మద్యం వంటి వాటికి కూడా కాస్త దూరంగా ఉండాలి. మలబద్ధకం తగ్గే యోగా, వ్యాయామాలు వంటివి చేస్తుంటే సమస్య తగ్గుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.