https://oktelugu.com/

Cold: దీర్ఘకాలంగా జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. తక్షణమే విముక్తి పొందండిలా!

ఒక్కసారి జలుబు వస్తే మాత్రం తగ్గడం చాలా కష్టం. ఎన్ని మందులు వాడిన, చిట్కాలు పాటిస్తున్నా కూడా కొందరికి తగ్గదు. అయితే ఏ సీజన్‌లో అయిన దగ్గు, జలుబుతో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే తక్షణమే విముక్తి చెందాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించండి. మరి అవేంటో ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 16, 2024 / 04:45 AM IST

    Cold

    Follow us on

    Cold: సీజన్‌తో సంబంధం లేకుండా కొందరికి జ్వరం, దగ్గు, జలుబు వంటివి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సమస్యలు తప్పవు. అయితే వర్షాకాలం, శీతాకాలం అయితే తప్పకుండా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. చల్లదనానికి కొందరు దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటితో ఇబ్బంది పడుతుంటారు. వాతావరణం మారడం వల్ల మాత్రమే కాకుండా కొందరు సరిగ్గా ఫుడ్ తీసుకోరు. బయట దొరికే ఫాస్ట్‌ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్ల కూడా జలుబు, దగ్గు, మలేరియా, డెంగీ వంటివి వస్తాయి. ఒక్కసారి ఇవి వచ్చాయనుకుంటే కొందరికి అసలు పూర్తిగా తగ్గవు. ఎన్ని రోజులు అయిన కూడా అలాగే ఉండిపోతుంది. దీంతో జలుబు, దగ్గుతో చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కసారి జలుబు వస్తే మాత్రం తగ్గడం చాలా కష్టం. ఎన్ని మందులు వాడిన, చిట్కాలు పాటిస్తున్నా కూడా కొందరికి తగ్గదు. అయితే ఏ సీజన్‌లో అయిన దగ్గు, జలుబుతో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే తక్షణమే విముక్తి చెందాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించండి. మరి అవేంటో ఈ రోజు స్టోరీలో తెలుసుకుందాం.

    పసుపు పాలు
    బాగా దగ్గు, జలుబుతో దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే వారు రాత్రిపూట పసుపు పాలు తాగితే తక్షణమే విముక్తి పొందుతారు. పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మళ్లీ జలుబు, దగ్గు బారిన పడకుండా ఉంటారు. రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు వేడి పాలలో టేబుల్ స్పూన్ పాలు కలిపి తాగాలి. ఇలా రోజూ చేసినట్లయితే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి విముక్తి పొందుతారు.

    తులసి ఆకులు
    హిందువులు తులసిని ఎంతో భక్తితో పూజిస్తారు. తులసిని పూజించడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చని భావిస్తారు. అయితే తులసి ఆకులను రోజూ నమలడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. లేదా తులసి ఆకులను బాగా రుబ్బుకుని దాన్ని నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత దాన్ని తాగడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మళ్లీ జలుబు, దగ్గు వంటివి వచ్చే ఛాన్స్‌లు కూడా తక్కువగా ఉంటాయి. రోజూ చేయడానికి సమయం లేని వారు కనీసం రెండు రోజులకు ఒకసారి అయిన చేయడం వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    నల్ల మిరియాలు
    ఘాటుగా ఉండే మిరియాలు ఆరోగ్యా్న్ని మేలు చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. నల్ల మిరియాలను పౌడర్ చేసి వాటిని పాలలో కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని మూలకాలు వెంటనే జలుబు నుంచి విముక్తి కలిగిస్తుంది. నల్ల మిరిమాలను బాగా పౌడర్ చేసి టేబుల్ స్పూన్ తీసుకుని గ్లాసు వేడి పాలలో కలపాలి. వీటిని నిద్రపోయే ముందు తాగడం వల్ల తక్షణమే ఫలితం ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా జలుబుతో ఇబ్బంది పడుతున్నట్లయితే రోజుకి రెండు సార్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.