Cleaning Tips: ఆడవాళ్లకు పట్టుచీర కనిపిస్తే బంగారంతో సమానంగా భావిస్తారు. పట్టుచీర ధరించిన స్త్రీలు ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తారు. ఒక్క చీరను తయారు చేయడానికి ఎంతో శ్రమ ఉంటుంది. అందుకే ఒక్కో పట్టుచీర క్వాలిటీని భట్టి రూ.50 వేలు అయినా ఉండొచ్చు. ఇంత ఖర్చు పెట్టి కొనుక్కున్న చీరను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు. కానీ అనివార్య కారణాల వల్ల ఒక్కోసారి చీరకు మరకలు పడొచ్చు. లేదా పదే పదే యూజ్ చేయడం వల్ల మురికిగా మారొచ్చు. అయితే మిగతా చీరల్లాగా పట్టుచీరను సాధారణంగా వాషింగ్ చేయరాదు. అలా చేస్తే చీర పాడవుతుంది. అందుకే చాలా మంది పట్టుచీరలను డ్రైక్లీనింగ్ కు ఇస్తూ ఉంటారు. కానీ డ్రై క్లీనింగ్ అవసరం లేకుండా ఇంట్లోనే కొన్ని పద్ధతుల ద్వారా పట్టుచీరలను ఇలా వాషింగ్ చేసుకోవచ్చు.. అదెలాగంటే?
కాలక్రమంలో వస్త్రధారణ విషయంలో ఎంత అభివృద్ధి చెందుతున్నా.. పట్టుచీరకు ఉండే విలువ తగ్గడం లేదు. ఇప్పటికీ చాలా మంది పట్టుచీర ధరించి అలరిస్తుంటారు. మహిళలు పట్టుచీరలను ఆదరిస్తున్నారు గనుకే.. వాటికి రోజురోజుకు డిమాండ్ మరింత పెరుగుతుంది.అయితే పట్టుచీరలను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న స్త్రీలు వాటిని వాడడంలో మాత్రం పొరపాట్లు చేస్తున్నారు. వీటిని ప్రత్యేకంగా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతో వాటిని కాపాడుకునేందుకు డ్రై క్లీనింగ్ కు ఇస్తుుంటారు.
ఇంట్లోనే పట్టుచీరను వాషింగ్ చేయాలనుకునేవారు ముందుగా చీరతో పాటు ఇచ్చిన స్టిక్కర్ చదవండి. దీనిపై డిటర్జెంట్ వాష్ ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోండి. డిటర్జెంట్ వాష్ లేకపోతే సాధారణంగా వాష్ చేసుకోవాలి. ఇందు కోసం సాధారణ నీళ్లలో కాసేపు పట్టుచీరను నానబెట్టండి. అయితే చాలా మంది వేడి నీళ్లలో నానబెట్టాలని చూస్తారు. కానీ ఇలా చేస్తే పట్టుచీరపై ఉన్న మెరుపు పోతుంది. నీళ్లలో చీర బాగా నానిన తరువాత మరో బకెట్ లో పరిశుభ్రమైన నీటిని తీసుకోండి. నీటిలో మురికి ఉంటే అది పట్టుచీరతో కలిసిపోతుంది.
ఇప్పుడు పరిశుభ్రమైన నీటిలో రెండు చెంచాల వెనిగర్ ను కలపండి. ఇందులో మరో 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత మరో బకెట్ లోని శుభ్రమైన నీటిలో ముంచడం వల్ల మరకలు పోతాయి. ఇలా సున్నితంగా వాష్ చేసిన తరువాత నీడ ఉన్న ప్రాంతంలో మాత్రమే ఆరవేయండి. బలమైన సూర్యకాంతిలో వేయడం వల్ల చీరకు ఉన్న షైనింగ్ పోతుంది. అలాగే నానబెట్టిన చీరను బయటకు తీసిన తరువాత అలాగే దండపై సూర్యకాంతి పడని ప్రాంతంలో మాత్రమే వేయండి.. ఇవి ఎండిన తరువాత మిగతా చీరలతో కాకుండా ప్రత్యేక ప్రదేశంలో భద్రపరచడం మంచిది.